జడ్జిల పై వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కొంత మంది వైసీపీ నేతల పై ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులు కూడా నమోదు అయ్యి, హైకోర్టులో విచారణలో ఉన్నాయి. అయినా కూడా వైసీపీ నేతల తీరు మారలేదు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, జడ్జిల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. చిత్తూరు జిల్లా బంగారుపాలం మండలంలో, ఒక గ్రామంలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ కొంత మందికి ఇళ్ళ పట్టాలు రాలేదు. దీనికి కారణం అక్కడ కొంత మంది ఆ భూమి పై అభ్యంతరం చెప్పటంతో, కోర్టు ఆ భూమి పంపిణీ పై స్టే విధించింది. ఈ నేపధ్యంలో స్థానిక వైసీపీ నాయకుడు, అతని కొడుకు, ఇద్దరూ కలిసి , దాదాపు 40 మంది దగ్గర, ఒక్కొక్కరి నుంచి వేల రూపాయలు వసూలు చేసారు. అయితే అదే వైసీపీ నాయకుడు, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని తెలుస్తుంది. అయితే నిన్నటి రోజున ఈ విషయం తెలుసుకున్న ప్రజలు తిరగబటడంతో అతన్ని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అయితే ఈ సందర్భంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, అక్కడ మాట్లాడుతూ జడ్జిల పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఎవరికీ ఎక్కవు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ycp 2612200 2

మీరు అసలు జడ్జీలేనా అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. అంతే కాకుండా పేద వాళ్ళకు మా ప్రభుత్వం ఎంతో చేస్తుంటే, ఇలాంటి వాటి పై స్టే ఇస్తారా, అసలు మీరు పేద కుటుంబాలు గురించి తేలియదా ? వాళ్ళ స్థితి గతులు తెలియవా ? అసలు మీరు జడ్జిలేనా ? చంద్రబాబు ఏమి చెప్తే దానికి అనుకూలంగా తీర్పులు ఇస్తారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. నిన్నటి రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ రోజు మీడియాలో వచ్చాయి. అయితే ఇలా కోర్టుల పై, జడ్జిల పై , ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయటం వైసీపీ నేతలకు కొత్త కాదు. గతంలో ఏకంగా జగన మోహన్ రెడ్డి ఇలాగే కోర్టుల పై వ్యాఖ్యలు చేసారు. ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా, కోర్టులను, న్యాయమూర్తులను తప్పు బడుతూ వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాము ఏమి చేసినా, మాకు ఎవరూ అడ్డు పడ కూడదు అనే ధోరణి ఎక్కువ అయిపోతుంది. అయితే జడ్జిలు కానీ, కోర్టులు కానీ, ఉన్న చట్టాలను బట్టి, తమ తీర్పులు ఇస్తాయి కానీ, ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇస్తే పై కోర్టులలో ఆ తీర్పులు నిలవవు కదా ? మరి పదే పదే వైసీపీ నేతలు, ఇలా న్యాయస్థానాలతో ఘర్షణ వాతావరణం ఎందుకు పెంచుకుంటున్నారో అర్ధం కావటం లేదు. కోర్టులు సీరియస్ అయితే, వీళ్ళు ఎమై పోతారు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read