పూతరేకు గురించి వినని ఆంధ్రులు ఉండరనడం లో అతిశయోక్తి లేదు. గోదావరి జిల్లాలు పూత రేకుల తయారీకి ప్రసిద్ధి. ఇందులో ఆత్రేయపురం పూతరేకుల రుచే వేరు. ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం పూత రేకుకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఐదు నుంచి ఎనిమిది మీటర్ల పొడవు ఉండే పూత రేకును ఏపీటీడీసీ పది మీటర్ల పొడవైన పూతరేకు రూపొందించి రికార్డు సాధించనుంది. అతి పొడవైన పూత రేకుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులోకి ఎక్కించేందుకు అవ సరమైన ఏర్పాట్లను పర్యాటక శాఖ చేసింది.
విజయవాడలోని బెరంపార్కులో గురువారం అత్యంత పొడవైన పూత రేకును తయారు చేసేందుకు పర్యాటక అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3గంట ల వరకు పూతరేకు తయారు చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జరిగే ఓ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వ హణాధికారి హిమాన్షు శుక్లా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ ప్రతినిధుల నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకోనున్నారు. పూతరేకుల తయారీ ఒక వినూ త్న ప్రక్రియ కాగా పదిమీటర్ల పొడవైనది అంటే ఆషామాషీ కాదు. ఇందుకోసం గోదావరి జిల్లాల నుం చి పాకశాస్త్రంలో ప్రావీణ్యులైన వారిని ఏపీటీడీసీ రప్పిస్తోంది.
ఇదే సమయంలో రికార్డు కోసం ఏ విధ మైన ఆధునిక పోకడలను తీసుకోవడం లేదని అధికా రులు చెపుతున్నారు. సాంప్రదాయకత వైపు మొగ్గు చూపుతూ కుండలపైనే పూతరేకును తయారు చేయ నున్నారు. ఇందుకు సంబంధించి ఏపీటీడీసీ సిఇవో హిమాన్షు శుక్లా ఒక ప్రకటన చేస్తూ తెలుగు వంటకా లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేం దుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను ఎంచుకున్నామ న్నారు.
ఇప్పటికే ఆంధ్ర వంటకాలను ప్రోత్సహించేం దుకు పలు చోట్ల ఆహార పండుగలు నిర్వహిస్తున్నామ ని, ఇదే సమయంలో అరకు బొంగు బిర్యానీని ఏపీ ప్రత్యేక వంటకంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వంటవారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యంత పొడవైన పూతరేకు రికార్డు సాధనకు సంబంధించి ముగింపు కార్యక్రమానికి ప ర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మీనా తదితరులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.