ఆయన మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి పేషీలో పని చేసిన కీలక అధికారి. విద్యా, వైద్య రంగాలకు కీలక సలహాదారుగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని పేరు. అందుకే ఆయన్ను ఏకంగా సియం పేషీలో కూర్చో బెట్టారు. ఆయనే పీవీ రమేష్, ఐఏఎస్. చంద్రబాబు హయాంలో కీలకమైన శాఖలు చూసుకునే వారు. చంద్రబాబు కూడా ఆయనకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, మంచి పోస్ట్ లో పెట్టారు. తరువాత ఆయన రిటైర్డ్ అయ్యారు. అయితే ఆయన రిటైర్డ్ అయినా సరే, జగన్ మోహన్ రెడ్డి తెచ్చుకుని, తన పేషీలో పెట్టుకున్నారు అంటే, ఆయన ఎంత ముఖ్యమో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఏమైందో ఏమో కానీ, ఉన్నట్టు ఉండి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ప్రక్షాళన పేరుతో పీవీ రమేష్ ను బాధ్యతల నుంచి తప్పించారు. అదే సందర్భంలో అజయ్ కల్లం రెడ్డిని మాత్రం ఉంచారు. అయితే మరేదైనా పదవి ఇస్తారేమో అని చాలా కాలం పీవీ రమేష్ ఎదురు చూసి చూసి, చివరకు జగన్ కు గుడ్ బయ్ చెప్పారు. పీవీ రమేష్ ను తప్పించటం పై రకరకాల కధనాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. ఆయన వేసే ట్వీట్లు కూడా, ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటూ వచ్చాయి. అయితే ఆయన ఏ రోజు కూడా, డైరెక్ట్ గా ఏమి జరిగిందో చెప్పలేదు.
జగన్ మోహన్ రెడ్డితో గుడ్ బాయ్ చెప్పి వచ్చిన తరువాత కూడా, ఆయన తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. అయితే తన పదవి పోయిన తరువాత, మొదటి సారి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి కలిసి పని చేయాలని, రాష్ట్ర హితం కోసం ఇద్దరూ కలిసి పని చేయాలని ట్వీట్ చేసారు. అయితే పీవీ రమేష్ ట్వీట్ పై, పలువురు స్పందించారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఉండేవారిని అందరినీ శత్రువులుగా చూస్తుంటే, ప్రధాన ప్రత్యర్ధి అయిన చంద్రబాబుతో సఖ్యత అనేది ఎలా ఉంటుందని అన్నారు. మరి కొందరు అయితే, పీవీ రమేష్ లాంటి సీనియర్ ఐఏఎస్ కూడా జగన్ వద్ద పని చేయలక వచ్చేసారని, అలాంటిది చంద్రబాబు ఎలా కలిసి పని చేయగలరని అన్నారు. మొత్తానికి పీవీ రమేష్ గారిది మంచి ఉద్దేశమే అయినా, మన రాష్ట్రంలో అధికార వైసీపీ పోకడలు చూసిన తరువాత కూడా ఆయన ఇలా ఎలా అన్నారో మరి ? బహుసా జగన్ కు డైరెక్ట్ గా చెప్పలేక, చంద్రబాబుని కూడా కలిపి చెప్పి ఉంటారు.