ఈ రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్లో, ఆయన స్పందిస్తూ, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం తాను ఈ ట్వీట్ చేస్తున్నానని, తనకు, తన కుటుంబ సభ్యులకు ఒక ఫోన్ నెంబర్ నుంచి (ఆ నెంబర్ కూడా పోస్ట్ చేసారు), వాట్స్ అప్ మెసేజ్ లు వస్తున్నాయని, ఇది ఎంపీ రఘురామకృష్ణం రాజు నెంబర్ గా నోటిఫై అవుతుందని, దీనిపై రఘురామరాజు స్పందించాలి అంటూ ట్వీట్ చేసారు. దీని పై ఎంపీ రఘురామకృష్ణం రాజు ట్విట్టర్ లోనే స్పందించారు. తనను మే 14 సిబిసిఐడి పోలీసులు, అరెస్ట్ చేసారని. ఆ సందర్భంగా నా ఫోన్ ని సీజ్ చేసారని, ఇది అనధికారికంగా తీసుకున్నారని, దాన్ని ఎక్కడా పోలీస్ రికార్డుల్లో కూడా చూపించలేదని, ఆ ఫోన్ ని నాకు తిరిగి ఇవ్వక పోవటంతో, తాను లీగల్ నోటీసులు ఇచ్చానని తెలిపారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు వస్తున్న మెసేజ్ లకు, నాకు సంబంధం లేదని అన్నారు. మే 14వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా ఆ నెంబర్ నుంచి ఎటువంటి మెసేజ్ లు ఎవరికీ పంపించలేదని అన్నారు. మే 14వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మీకు వస్తున్న మెసేజ్ లు, నేను ఇవ్వలేదని, ఇది సిఐడి అధికారుల పని అని, వారి పై మీరు లీగల్ ఆక్షన్ తీసుకోవచ్చని అన్నారు.
తాను, జూన్ 1న ఆ నెంబర్ ఉన్న సింని సస్పెండ్ చేసి, కొత్త సిం తీసుకున్నా అని, కాబట్టి, ఆ మెసేజ్ లకు తనకు సంబంధం లేదని, రఘురామకృష్ణ రాజు తెలిపారు. నా ఫోన్ నాకు ఇవ్వకుండా, వారి దగ్గర ఉంచుకుని, దాన్ని రికార్డుల్లో కూడా చూపించకుండా చేసారని, దీని పై ఇప్పటికే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు కూడా ఇచ్చానని, మీకు వస్తున్న మెసేజ్ల పై అభ్యంతరం ఉంటే, మీరు కూడా లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు అంటూ, పీవీ రమేష్ ట్వీట్ కు, రఘురామకృష్ణం రాజు బదులు ఇచ్చారు. అయితే ఈ అంశం ఇప్పుడు వివాడస్పదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ఎంపీ ఫోన్ ని, అదీ ఖరీదైన ఐఫోన్ ని ఆయన దగ్గర నుంచి తీసుకున్నారని, తన ఫోన్ ని కూడా అన్ లాక్ చేయాలని బలవంతం చేసారని ఇది వరుకే రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే ఆ ఫోన్ లో తన నియోజకవర్గానికి సంబంధిన అనేక సమాచారం ఉందని, అయితే ఈ ఫోన్ రికార్డుల్లో చూపించక పోవటం పై, రఘురామ రాజు సీరియస్ అయ్యి, సిఐడి కి లీగల్ నోటీసులు ఇచ్చారు.