సీఐడీ చీఫ్‌గా మొన్నటివరకూ పనిచేసిన సునీల్ కుమార్ కి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చారు. డిజిపి ర్యాంకు ఇచ్చి గౌరవించారు. అయితే ఆయనపై ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన కేంద్రం ప్రభుత్వం డిమోషన్‌కి సిఫారసు చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్‍కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. డీజీ సునీల్‍కుమార్‍పై చర్యలు తీసుకోవాలని అందులో వివరించింది. అంబేద్కర్ ఇండియా మిషన్ (ఎయిమ్) నడుపుతున్న సునీల్ కుమార్ అదే వేదికపై చేసిన విద్వేషపూరిత ప్రసంగమే ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఈ హేట్ స్పీచ్ పై కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సునీల్ కుమార్ ప్రసంగించారంటూ అందులో పేర్కొన్నారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుతో పాటు డీవోపీటీ లేఖను ఏపీ సీఎస్‍కు కేంద్రహోంశాఖ పంపడంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్ పై గృహహింస కేసు కూడా ఉంది. దీనిపైనా ఫిర్యాదులున్నాయి. సీఐడీ కస్టడీలో టార్చర్ పెట్టారనే కేసు కూడా హైకోర్టులో విచారణకి వచ్చింది. మొత్తానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి నిబంధనలు పాటించకుండా, చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులలో సునీల్ కుమార్ దెబ్బకి భయం నెలకొంది.
మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ షాక్... చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం.. రఘురామ సాధించాడు...
Advertisements