నవ్యాంధ్ర రాజధాని ఏర్పడిన తరువాత విజయవాడకు ఎక్కడలేని మహర్దశ వచ్చిందనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం గుణదలలో విద్యుత్ సౌధను అందంగా నిర్మించారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లకు చెందిన రాష్ట్రస్థాయి విభాగాలన్నీ ఈ భవనంలో పనిచేస్తున్నాయి. ఈ భవనం ఏలూరు రోడ్డులోని రామవరప్పాడు వద్ద పవర్ హౌస్ సమీపంలో ఉంది. అయితే తాజాగా బందర్ రోడ్డులోని కీలకమైన ప్రదేశంలో (డీటీసీ కార్యాలయం పక్కన) రోడ్డుకు పక్కగా ఒ అందమై భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో అన్ని హంగులను వేగంగా ఏర్పాటు చేశారు. ఆర్ అండ్ బీ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఈ భవనంలో ఉండనున్నాయి. రాత్రి వేళ ఈ భవనాన్ని చూస్తే పారిస్ భవనాలు గుర్తుకొస్తాయి. రంగులు మార్చుకుంటూ తళుక్కుమంటున్న విద్యుద్దీప కాంతులతో ఈ భవనం జిగేల్ మంటున్నది. గ్రీనరీతోపాటు ఇక్కడే ఒక పౌంటెన్ను కూడా భవనం ముందు ఏర్పాటు చేశారు.
ఈ భవనాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రారంభించనున్నారు. ప్రధాన కార్యాలయంలోని అన్ని శాఖలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు బందరు రోడ్డులో సుమారు 3.5 ఎకరాల్లో 2.70 లక్షల విస్తీర్ణంలో రూ.101 కోట్ల వ్యయంతో జీ+5 భవనం నిర్మించారు. హైదరాబాద్ కు చెందిన ఒకప్రైవేటు సంస్థకు భవన నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా ఈ బహుళ అంతస్తుల భవనం బందరు రోడు పై నిర్మిస్తుండడంతో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని భావించి, భవన నిర్మాణానికి అవసరమైన బీమ్, పిల్లర్లు, స్లాబ్ కు సంబంధించిన మెటీరియల్ అంతా బయటే తయారు చేసి తీసుకువచ్చారు..
ప్రీ కాస్ట్ విధానంలో నిర్మాణం వేగవంతంగా ఈ భవనం పూర్తయ్యింది... ప్రతి అంతస్తులో... ఒకేసారి 200 మంది వరకు అధికారులతో భేటీ అయ్యేలా సమావేశ మందిరాలు, 100 మందితో భేటీలు నిర్వహించే మినీ కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారు. వీడియో కాన్ఫరెన్స్‌లకోసం ప్రత్యేకంగా భారీ మందిరం ఉంటుంది. మొత్తంగా ఈ భవనంలో ఆర్ అండ్ బీ తో పాటు మరో 10 శాఖలు కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉంటాయి.