కడప జిల్లా రైల్వేకోడూరులో, గెలుపే లక్ష్యంగా ప్రచారంలో తెలుగుదేశం పార్టీ దూసుకునిపోతోంది. అయితే నాయకుల సమన్వయ లో పంతో వైసీపీ చతికిలపడి ఊగిసలాడుతోంది. వైసీపీలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు అన్నితానై చూసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా పట్టించుకునే స్థితిలో వైసీపీ లేదు. దీన్ని వీక్‌నెస్‌గా తీసుకున్న టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కస్తూరి ప్రధానంగా విశ్వబ్రాహ్మణులు, స్వర్ణ కారులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, ఆటో కార్మికులు, దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలను సైతం పార్టీలోకి తీసుకు వచ్చి వారి మద్దుతు కోరుకున్నారు.

pk 01042019 1

వారు టీడీపీకి మరిం త దగ్గరయ్యే విధంగా వ్యూహరచనలు చేస్తూ ముందుకు పోతున్నారు. టీడీపీని ఎక్కువగా మహిళలు ఆదిరిస్తున్నారు. పేదలు బ్రహ్మరథం పడుతున్నాయి. పసుపు-కుంకుమ పథకంతో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మహిళలకు నమ్మకం ఏర్పడింది. ప్రజలకు చంద్రబాబునాయుడే ఒక్కరే సామాజిక న్యాయం చేస్తారని ప్రజలు భావిస్తుం డడంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళుతోంది. ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో ముస్లింలు, బీసీలు, అగ్రవర్ణాలు మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావాలని కోరుకుంటున్నారు.

pk 01042019 1

అభివృద్ధి అంతా ఐదేళ్లలో చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేయడంతోనే రైల్వేకోడూరు నియోజకవర్గంలో బ్రిడ్జిలు, సిమెంట్‌ రోడ్లు, గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు, ఫించన్లు, పక్కాగృహాలు, రేషన్‌కార్డులు తదితరాలను అందించడంతో టీడీపీ ప్రజల్లో చొచ్చుకునిపోతోంది. ్ల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు, మంగంపేట పల్వరైజింగ్‌ మిల్లుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకులు మాచినేని విశ్వశ్వరనాయుడు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు బత్తిన గంగయ్యయాదవ్‌, నియోజకవర్గ నేత లు కట్టాబాలాజీ, దామోదర్‌రాజు, వెం కట్రామరాజు, యువనేత కొమ్మాశివ, బత్యాల వర్గీయుడు దివిటి మోహన్‌ ప్రచారం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read