30 ఇయర్స్ పృథ్వి, ఎన్నికల్లో చేసిన సేవ నచ్చి, అతనికి ఎస్వీబీసి చైర్మెన్ పదవి ఇచ్చారు జగన్. అయితే అక్కడ వెంకన్న స్వామి సేవ చేస్తూ, వెంకన్న స్మరణలో ఉండాల్సిన పృధ్వీ మాత్రం, జగన్ మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారు. ఎస్వీబీసి చైర్మెన్ పదవిలో ఉంటూ, స్వామి వారిని కాకుండా, జగన్ ని పొగుడుతున్నారు. పులి కడుపున, మరో పులి పుడుతుంది అంటూ భక్తిని చాటుకుంటూ, వివాదాలు రేపుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటం ఇష్టం లేదు అంటూ ప్రకటన చేసారు. అందుకే ఇప్పటి వరకు జగన్ ను కలిసి సన్మానం చెయ్యలేదు అన్నారు. అయితే దీని పై, అగ్ర హీరో, రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎవరైనా గౌరవం ఇస్తామని, ఎవరైనా ఇవ్వాల్సిందే అన్నారు.
ఇప్పటికిప్పుడు జగన్ ను కలిసి చర్చలు జరపటానికి, మేము పెట్టుబడి దారులం కాదని, సమయం వచ్చినప్పుడు ఆయన్ను కలుస్తామని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల పై పృధ్వీ స్పందిస్తూ, రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని, జగన్ ను ఎవరైనా అవమాన పరిస్తే, తాట తీస్తాను అంటూ హెచ్చరించారు. అయితే ఇప్పటికే పృధ్వీ వ్యాఖ్యలను, ఒకే పార్టీ అయినా సరె పోసాని ఖండించారు. అయితే, ఇప్పుడు మరో హీరో, ఆర్ నారాయణ మూర్తిని, ఈ విషయం పై మీడియా అడిగింది. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటం, తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని, వైసీపీ నాయకులు అంటున్నారు, మీరేమంటారు అని మీడియా ఆర్ నారాయణ మూర్తిని ప్రశ్నించింది. దీని పై ఆయన సూటిగా సమాధానం చెప్పారు.
రాజకీయలాకు, సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉండదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము వారిని అభిమానిస్తామని అన్నారు. చిత్ర పరిశ్రమ అద్దాల మేడ లాంటిదని, మేము వేరే వారిని విమర్శించే అవకాసం ఉండదని అన్నారు. మరో ప్రశ్నగా, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అని మీడియా ప్రశ్నించింది. దానికి ఆర్ నారాయణ మూర్తి స్పందిస్తూ, గతంలో తనకు కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశాలు వచ్చాయని, కాని అప్పుడు తిరస్కరించానని, ప్రస్తుతం ఇంకా సినిమాల్లో ఉన్నానని, సినీమాలకు స్వస్తి చెప్పినప్పుడు, రాజకీయాల్లోకి వచ్చే విషయం అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. అలాగే గోదావరి జలాలను ఉత్త రాంధ్రకు తరలించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల మంచి ప్రాజెక్ట్ అని అన్నారు. నిన్న ఆయన, అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో కోటనందూరులో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గున్నారు.