వైకాపాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఈ అవమానాలు వేరెవరికీ జరగకూడదన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నా తండ్రి అభిమానులను సంతృప్తి పరిచేందుకే ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లానన్నారు. విగ్రహావిష్కరణకు ఎందుకు వెళ్లావంటూ వైకాపా నేతల తనను మందలించారన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలని ఆయన సూచించారు. తనను చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పారు.

cbn 22012019

ఎలాంటి ఆకాంక్షలు లేకుండా ప్రజాజీవితంలో కొనసాగాలనుకుంటున్నానని.. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేని పార్టీలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. అందుకే వైకాపాలో కొనసాగి ఏమీ చేయలేననే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తనను చంపేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పారు. తన ప్రాణం కంటే తన తండ్రి ఆశయం ముఖ్యమని.. రంగా అనే వ్యవస్థను బతికించాలన్నారు. ఎమ్మెల్యేలు దేనికి పనికరారు అని జగన్ అన్నారని, ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేని పార్టీలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. అందుకే వైకాపాలో కొనసాగి ఏమీ చేయలేననే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు.

cbn 22012019

"వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు రకరకాల గ్రూపులను క్రియేట్ చేయించారు. కొంతమంది బెదిరింపులు... నిన్ను చంపేస్తాం... నీ అంతు తేలుస్తాం... నన్ను చంపి, నీకు నికు నిజంగా శాటిస్ ఫాక్షన్ వస్తుందని అనుకుంటే, నన్ను చంపేసేయండి బాబూ... నాకు ఎటువంటి... తాడూ బొంగరం లేనోడిని. నాకు అన్నింటికంటే ముఖ్యం ఒకటే. నా తండ్రి ఆశయం. నా తండ్రి పోరాడింది పేద ప్రజలు బాగుండాలనే. పేద ప్రజల పట్టాల కోసమని, ఇళ్ల కోసమని ఆయన ఆనాడు పోరాడారు. ప్రాణాలు అర్పించారు. నన్ను చంపేయాలని అనుకుంటే, నాకెలాంటి ఇదీ లేదు" అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు గల కారణాలను తాను ఇంతకుముందే మీడియాకు చెప్పానని, తన తండ్రి కన్న కలల గురించి జగన్ కు చెప్పిన వేళ, వాటిని నెరవేర్చేందుకు సహకరిస్తానని చెప్పిన ఆయన, తరువాత స్పందించలేదని రాధా వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read