అమరావతిలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రాజధాని రైతుల పోరాటానికి, ఈ రోజు టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంఘీభావం ప్రకటించారు. తుళ్లూరులో రైతులు చేస్తున్న ఆందోళనలో ఆయన పాల్గున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, రాజధాని రైతులకు తాము అండగా ఉంటామని రాధా అన్నారు. ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని అని నినదించారు. ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పినా, ముప్పై రాజధానులు అని చెప్పినా, తమ నినాదం మాత్రం, ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని అని చెప్పారు. రైతులు ఏ పిలుపు ఇస్తే, అది మేము చేస్తామని, రైతులు నాయకత్వంలోనే తాము ముందుకు వెళ్తామని అన్నారు. రాజధాని కోసం, 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులని, రాధా ప్రశంసించారు. తమ రాష్ట్రం బాగుతో పాటుగా, తమ భవిషత్తు కూడా బాగుంటుందని, రైతులు ముందుకొచ్చి, భూములు ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వం వారికి అన్యాయం చేసిందని రాధా అన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ, రైతులు చేస్తున్న పోరాటాన్ని రాధా అభినందించారు.

radha 14012020 2

ఇదే సమయంలో రాధా జగన్ పై, ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రైతులకు కూడా కులం అంటగట్టడం వీరికే చెల్లిందని అన్నారు. రాజధాని రైతులు చేసిన త్యాగాలు, దేశం మొత్తం ఆదర్శం అయితే, మన ప్రభుత్వం మాత్రం, ఇదే రైతులని రోడ్డున పడేసిందని అన్నారు. జగన మోహన్ రెడ్డికి పక్క రాష్ట్రంలో సియంతో మాట్లాడటానికి టైం ఉంటుంది కాని, అమరావతి రైతులతో మాట్లాడే సమయం లేదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ఏ జిల్లాలో అయితే, ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేసారో, అదే జిల్లాకు సమస్యలు తెచ్చి పెట్టి, వెన్నుపోటు పొడిచారని రాధా అన్నారు. ఒక పక్క 27 రోజులుగా అమరావతి రైతులు రోడ్డున పడి ఇబ్బందులు పడుతుంటే, జగన్ మొహన్ రెడ్డి గారికి మాత్రం, ఎడ్ల పందాలకు వెళ్ళటానికి టైం ఉంటుందని అన్నారు.

radha 14012020 3

రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, ఒకరి తరువాత ఒకరు వచ్చి హేళన చేస్తున్నారని, కడుపు మాడి వీళ్ళు ఉంటే, వీరిని పైడ్ ఆర్టిస్ట్ లు అని ఎలా అనాలి అనిపిస్తుందని రాధా అన్నారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే, జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇది ఒక పార్టీ పోరాటం కాదని, ప్రజల పోరాటం అని అన్నారు. ఆడవాళ్ళని ముందు పెట్టి నడిపిస్తున్నారని, ఆడవాళ్ళే అంటున్నారని, ఒక తల్లి ముందుండి నడిపిస్తే, మేమందరం వారి వెనుక నడుస్తామని రాధా అన్నారు. 20 వ తారీఖు ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే, దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధం కావాలని అన్నారు. పండుగ పూట మీతో కలిసి ఉండటం సంతోషంగా ఉందని అనంరు. ఈ సందర్భంగా, వంగవీటి రాధాకు మహిళలు, పోలీసులు ఎలా కొట్టింది దెబ్బలు చూపిస్తూ తమ గోడును వినిపించుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read