అమరావతి జనభేరి సభలో, వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసారు. కులం కులం కులం అంటూ, అమరావతి పై కుల ముద్ర వేస్తున్నారు, నేను నీ దగ్గర ఉన్నప్పుడు, ఏ కులమో , ఇప్పుడు అదే కులం, వంగవీటి రంగా కుమారడిగా చెప్తున్నా, రికార్డులు చూసుకో నా కులం ఏమిటో, ఇక్కడ స్టేజి పై ఉన్న వాళ్ళు, నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళు ఏ కులం అంటూ, రాధా ఆవేశంగా మాట్లాడుతూ, కులం ముద్ర వేస్తున్న వారికి ఘాటుగా సమాధానం చెప్పారు. ఆయన ఏమి చెప్పారో, ఆయన మాటల్లోనే,... "ఈ రోజు మన రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడగొడదాం అని పాలకులు చూస్తున్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మిగతా వెనుకబడుతున్నాయి అంటున్నారు. కానీ ఇంతకు ముందు, గత ప్రభుత్వంలో చూసుకుంటే, ఒక పక్క చిత్తూరులో శ్రీ సిటీలో అనేక పెట్టుబడులు వచ్చాయి, తరువాత సీమ వైపు సోలార్ ప్లాంటులు, ఇటు గుంటూరు, కృష్ణాలో రాజధాని, గోదావరి జిల్లాలు ఆక్వా పెట్టబడులు, వైజాగ్ ఐటి హబ్ గా మారింది. ఇక కేవలం ఒక కులం వాళ్ళే అమరావతిలో బాగు పడుతున్నారని అంటున్నారు, ఇలాంటి వాగుడు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న, ఎవరెవరు ఏ కులమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఏదైనా పొరపాటు ఉంటే నా కులం కూడా ఒకసారి చూసుకోండి, మరోసారి చెక్ చేసుకోండి, నేను రంగా గారి అబ్బాయిని, మీకు అనుమానం ఉంటే ఒకసారి రికార్డులు చూసుకోండి. మీతో పాటు ఉన్నప్పుడు ఏ కులంలో ఉన్నానో, ఇప్పుడు కూడా అదే కులంలో ఉన్నాను,"

radha 17122020 2

"నా రాష్ట్రము కోసం పోరాడతాను అని చెప్పి చెప్తున్నాను. చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవటానికి, బురద జల్లుతూ రైతులని వెటకారం చేస్తూ, ప్రజలని వెటకారం చేస్తూ, రాష్ట్రాన్ని మూడు ముక్కల కింద విభజించి ఆడుకుందాం అని, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండ ప్రజలందరూ ప్రాంతాలు, కులాలు, మతాలు ఇవన్నీ పక్కన పెట్టి, కలిసికట్టుగా పోరాడి మన రాష్ట్రాన్ని, మన రాజధాని అమరావతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని కూడా అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఒక పక్కన నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళు ఏ కులం వాళ్ళో, ఏ ప్రాంతం వాళ్ళో చూడామని, ఈ ప్రాంతం వాళ్ళని కోరుతున్నా. మా అందరి ఆశ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ, శ్వాస ఒకటే, అది అమరావతి ఒక్కటే అని తెలియ చేస్తూ, ముగిస్తున్నాను. అందరం కలిసి కట్టుగా పోరాడుతున్నాం. మా అందరికీ బాధ్యత ఉందని భావించాం కాబట్టే, రోడ్డు ఎక్కాం. రైతుల కోసం అండగా నుంచుంటాం. ఎప్పటికీ వారికి అండగా ఉంటాం. మన అమరావతి పోరాటం తప్పకుండా ఫలిస్తుంది, తప్పకుండా అది సాధించే వరకు అందరం కలిసి కట్టుగా ఉందాం అని కోరుతున్నాను. రైతులకు మద్దతు తెలియచేసిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు " అని రాధా అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read