వంగవీటి అంటే బెజవాడలోనే కాదు, కోస్తా జిల్లాల్లో కూడా ఒక బ్రాండ్. దానికి వారసుడిగా ఉన్న వంగవీటి రాధా మాత్రం, రాజకీయంగా ఎదగలేక పోయారు. దానికి ప్రధాన కారణం ఆయన పార్టీలు మారే విధానం అనే చెప్పాలి. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన రాధా ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి కారణం, ఈ రోజు రాధా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ కావడం. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా అరగంట పాటు, రాధా పవన్ కల్యాణ్‌తో వంగవీటి భేటీ అయ్యారు. వంగవీటి రాధా, త్వరలోనే జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు అనుచరులు ప్రచారం చేసారు. జనసేనలో చేరేందుకే రాధా, పవన్‌తో భేటీ జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు, జగన్ తనను అవమానించారని చెప్తూ, రాధా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు టికెట్ ఇవ్వరని తెలిసినా, ఆయన పార్టీలో చేరి, ప్రచారం చేసారు. అప్పట్లో ఈయనకు ఎమ్మల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఎమ్మల్సీ ఆశలు గల్లంతు అయ్యాయి.

అయితే తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యల పై పోరాడకుండా, మళ్ళీ పార్టీ మరే ఆలోచనలో పడ్డారు. అందరూ బీజేపీలో చేరుతుంటే, రాధా మాత్రం, జనసేన వైపు చూస్తున్నారు. తన సామాజికవర్గం ఎక్కువగా ఆదరించే పార్టీ కావటంతో, అటు వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అయితే రాధా మాత్రం, ఎప్పుడూ నిలకడగా లేకుండా ఇలా పార్టీలు మారుతూ ఉంటే, చూసే వాళ్ళకు కూడా ఇబ్బందిగ ఉంటుంది. ఇప్పటికే రాధా నాలుగు పార్టీలు, మారి, అయిదవ పార్టీ వైపు చూస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన రాధా, ఎమ్మల్యే అయ్యారు. తరువాత చిరంజీవి పార్టీ పెట్టటంతో ప్రజారాజ్యం వైపు వెళ్లారు. ప్రజారాజ్యం ఎత్తేయటంతో, కాంగ్రెస్ లో విలీనం అయినా, అటు వెళ్ళకుండా, వైసీపీ వైపు వచ్చారు. ఇక్కడ జగన్ తో విభేదాలు రావటంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, మరో సారి పార్టీ మారే ఆలోచనలో జనసేన వైపు చూస్తున్నారు. మొత్తానికి, అయుదు సార్లు, అయుదు పార్టీలు మారిన నేతగా రాధా నిలిచిపోతారు. బీజేపీ కూడా రాధా వైపు చూస్తునట్టు తెలుస్తుంది. మరి రాధా జనసేన వైపు వెళ్తారో, బీజేపీ వైపు వెళ్తారో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read