ఇంతకాలం ప్రధాని మోడీ దాచి ఉంచిన రాఫెల్ విమానాల కొనుగోలులో చోటుచేసుకున్న కుంభకోణం గుట్టు రట్టయింది. రాఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసే ఫ్రాన్స్ కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్ 2016లో వెలువరించిన తన వార్షిక నివేదికలో అసలు విషయాన్ని బైటపెట్టింది. పార్లమెంటుకు సైతం ఈ ఒప్పందం వివరాలను ప్రధాని వెల్లడించలేదు. జాతీయ భద్రత, దేశ ప్రయోజనాల రక్షణకు సంబంధించిన రహస్యం తదితర అంశాలన్నీ ఈ ఒప్పందంలో చోటుచేసుకున్న కుంభకోణం వెలుగులోకి రాకుండా చెప్పినవే... బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీగానే అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. విమానాలను విక్రయించిన కంపెనీయే వాస్తవాలను వెల్లడించడంతో మోడీ ప్రభుత్వం బండారాలు బైటపడ్డాయి.

modi 02042018 1

ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వ ధనాగారానికి రూ.12,630కోట్ల నష్టం సంభవించింది. ఈజిప్టు, ఖతార్లకు మనకు విక్రయించడానికంటే 11నెలల ముందే వారికి విక్రయించారు. ఆ దేశాలకు విక్రయించిన దానికంటే ఒక్కొక్క జెట్ ఖరీదు రూ. 350కోట్లు అదనంగా మనకు విక్రయించారు. 36 రాఫెల్ జెట్లను 2016లో 7.5 బిలియన్ యూరోలకు మనకు ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించింది. 2015లో ఖతార్, ఈజిప్టులకు 48 జెట్లను 7.9 బిలియన్ యూరోలకు విక్రయించింది. మనకు విక్రయించిన విమానాల ఖరీదు రూ. 1,670.70 కోట్లుకాగా, ఈజిప్టు, ఖతార్లకు విక్రయించిన విమానాల ఖరీదు రూ. 1319.80కోట్లు అవుతుంది. అంటే ఒక్కొక్క జెట్ ఖరీదులో తేడా రూ. 351 కోట్లు ఉంది. యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మోడీ రద్దు చేయకుండా ఉన్నట్లయితే మనకు రూ.41,212 కోట్లు పొదుపు అయ్యేది.

modi 02042018 1

2015 ఏప్రిల్లో నరేంద్ర మోడీ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. 2012లోనే వీటి కొనుగోలుకు టెండర్లు పిలిచినప్పుడు అమెరికా, ఐరోపా, రష్యాలు కూడా విక్రయించేందుకు ముందుకువచ్చాయి. దస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన 18 జెట్ విమానాలను కొనుగోలు చేయడం మరో 108 బెంగుళూరులోని హెచ్ఏఎల్ కంపెనీ అసెంబుల్ చేయడం జరగాలని నిర్ణయించారు. అయితే రెండు ఇంజిన్లు కలిగిన 126 రాఫెల్ జెట్లను కొనడం చాలా ఖరీదవుతుందని సాకుచెప్పి, కుదిరిన ఒప్పందాన్ని మోడీ రద్దు చేసారు. అంతేకాదు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నించకుండా మోడీ రెడీగా ఉన్న 36జెట్ విమానాల కొనుగోలుకు నిర్ణయించారు. 2016 జనవరిలో కొనుగోలు ఒప్పందాన్ని ధృవీకరించారు. 2016 సెప్టెంబరులో మోడీ పారిస్ లో పర్యటించిన సందర్భంగా జెట్ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రాఫెల్ జెట్ విమానాల ఒప్పందాన్ని బైట పెట్టడానికి వీలులేదని రక్షణమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు చెప్పారు. మోడీ ప్రభుత్వం దాచివేసినాదాగని వాస్తవాలను విమానాలను విక్రయించిన కంపెనీ బైట పెట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read