ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం, మరో పక్క జగన కు సరైన మైలేజి రాకపోవటం, కొన్ని చోట్ల అభ్యర్దులు లేక, మరీ తక్కువ స్థాయి నాయకులు ఉండటంతో, వైసీపీలో టెన్షన్ మొదలైంది. అందుకే నేరుగా పీకే రానంగాలోకి దిగారు. ‘‘చూడండి... ఇది సర్వే! రాష్ట్రంలో మాదే గెలుపు. మీ నియోజకవర్గంలోనూ మేమే గెలుస్తామని తేలింది. మీరుకూడా ఇటువైపు వచ్చేయండి! మా కోసం కాదు... మీ మేలు కోరి చెబుతున్నాం’’ టీడీపీకి చెందిన ఒక బలమైన అభ్యర్థులకు వైసీపీ నుంచి అందిన సందేశాలివి! ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ... అధికారపక్షంలో ఉన్న నేతలను సంప్రదించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అసలు ఘట్టానికి ముందే టీడీపీ నేతల స్థైర్యాన్ని దెబ్బకొట్టడం, వారిని త మ వైపునకు తిప్పుకోవడం, కుదరకపోతే తప్పుడు ప్రచారం చేసి వారిని ఆత్మరక్షణలో పడేయడం! ఇదీ వైసీపీ వ్యూహం! దీని అమలు బాధ్యతను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగించారు. మరీ అవసరమైతే పార్టీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్(పీకే) ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతారు.
ఈ వ్యూహం ప్రకారం.. పీకే నిర్వహించిన సర్వేలలో భారీ మెజారిటీతో గెలిచే అవకాశమున్న టీడీపీ నేతలపై గురిపెట్టారు. తాము నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అంటూ ఒక నివేదికను వారి ముందు పెడతారు. ‘మీ నియోజకవర్గంలోనూ వైసీపీయే గెలుస్తుంది’ అంటూ మానసికంగా ఒత్తిడి పెంచుతారు. ఆ తర్వాత... మా పార్టీలోకి వస్తే సీటు ఇస్తామని అభయమిస్తారు. అం తా సవ్యంగా ఉందనుకున్న తర్వాత విజయసాయి రంగ ప్రవేశం చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణకు ఈ అనుభవం ఎదురైంది. ఆయ న ఈ వ్యూహాలకు తలొగ్గలేదు. దీంతో.. వైపీపీ తన అనుకూల మీడియా ద్వారా పితాని పార్టీ మారుతున్నారని ఊదరగొట్టింది. దీంతో పితానిపై సొంత పార్టీ నేతల్లో అనుమానం తలెత్తుతుందని, ఆయన్ను దూరంగా పెడితే చేసేదే మీ లేక ఆయన టీడీపీని వీడి వైసీపీ గూటికొస్తారని భావించారు.
ఇవేమీ కుదరకపోవడంతో పీకే నేరుగా రంగంలోకి దిగారు. ‘నేను వచ్చి కలుస్తాను. టైమ్ చెప్పండి’ అని పితానిని కోరారు. ఇందుకు పితాని విముఖత వ్యక్తం చేశారు. అయినప్పటికీ... పితాని వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతూనే ఉంది. చావోరేవో కావడం వల్లే... జగన్ సొంత పార్టీ పెట్టి ఇప్పటికి తొమ్మిదేళ్లయింది. గత ఎన్నికల్లో విజయంపై గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ... ఫలితం లభించలేదు. ఈసారి ఎన్నికల్లో ఇదే అనుభవం ఎదురైతే పార్టీని బతికించుకోవడం కష్టమనే భయం ఆయనను వెంటాడుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపుకోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.