‘‘దేశంలోని స్వతంత్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)ని ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది’’ అని ఆ సంస్థ విశ్రాంత ముఖ్య విచారణ అధికారి(సీఐఓ) రఘోత్తమన్‌ ఆరోపించారు. ‘సీబీఐ - ఇటీవలి పరిణామాలు’ అనే అంశంపై చెన్నైలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ‘‘సీబీఐలో నేను 36 ఏళ్లు పని చేసి, పదవీ విరమణ చేశాను. సంస్థ పరువు ప్రతిష్ఠలు దిగజారిపోవడం ఆవేదన కలిగిస్తోంది. నేటి పరిస్థితులో నేను సీబీఐలో పనిచేశానని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, అవమానంగా భావిస్తున్నాను.

cbi 05112018 2

సీబీఐ పాలనావ్యవహారాల్లో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ అధ్యక్షుడిని మార్చడం ప్రశ్నార్థకంగా ఉంది. సీబీఐని కాంగ్రెస్‌ తన జేబు సంస్థగా చేసుకుందని విమర్శించిన బీజేపీ... అధికారంలోకి వచ్చాక సంస్థ పరువు ప్రతిష్ఠలనే మంటగలిపింది. సీబీఐలో నిస్వార్థంగా సేవలు చేసిన అధికారులందరిపై బీజేపీ బురదజల్లేలా ప్రవర్తిస్తూ, ఆ దర్యాప్తు సంస్థలో చీలికలు సృష్టించింది. సీబీఐలో ఉన్నతాధికారిని మార్చటం ఇప్పటి దాకా కష్టసాధ్యంగా ఉండేది. అలాంటిది బీజేపీ పాలకులు సునాయాసంగా సీబీఐ ఉన్నతాధికారిని మార్చివేశారు’’ అని అన్నారు. సీబీఐకి ఉన్న అధికారాలను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ పేరును ‘కంట్రోల్డ్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’గా మార్చటం మంచిదని ఎద్దేవా చేశారు.

cbi 05112018 3

‘నేను దేశ సంపదను ఎవరూ దోపిడీ చేయకుండా చౌకీదారు (కాపలాదారు)గా వ్యవహరిస్తాను. నేను లంచం తీసుకోను, ఎవరూ లంచం తీసుకునేందుకు అనుమతించను. ఎవరికీ అన్యాయం జరగని విధంగా వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తాను.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. కాని ఇవాళ మోదీ హయాంలో సిబిఐలో జరుగుతున్న వ్యవహారాల్ని చూస్తుంటే గత నాలుగున్నరేళ్లలో వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు రాకపోగా, ఆ వ్యవస్థలు మరింత భ్రష్టుపట్టిపోతున్నాయని, సిబిఐ అనే సంస్థ బ్రోకర్లకు అడ్డాగా మారిపోతోందని తెలుస్తోంది. సిబిఐ వంటి ఉన్నత సంస్థలో ఇద్దరు డైరెక్టర్లు ఒకర్ని మరొకరు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం వారిని ఎంపిక చేసిన వారి విజ్ఞతనే ప్రశ్నార్థకం చేస్తున్నది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read