వైసిపీ అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఎక్కడ చూసినా ఈ ఏడాదిలో గందరగోళమే. మొదటి నాలుగు నెలలు, ఇసుక లేక, పనులు లేక, రాష్ట్రం అల్లాడిపోయింది. తరువాత నాలుగు జిల్లాల్లో వచ్చిన వరదలతో, మొత్తం గందరగోళం. ఇక గత నాలుగు నెలలుగా కరోనాతో, జీవితాలు తలకిందులు అయిపోయాయి. ఇక వీటికి తోడూ అన్ని చోట్లా మాఫియాలే. ఏకంగా వైసిపీ నేతలే, ఈ మాఫియాలు బయట పెట్టటం కొస మెరుపు. ఇసుక మాఫియా, నాటు సారా మాఫియా, మద్యం మాఫియా, ఇళ్ళ స్థలాల మాఫియా, ఇలా ప్రతి విషయంలోనూ మాఫియానే. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పై ఎక్కడ చూసినా అసంతృప్తి. దీంతో ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులు అన్నిటి నుంచి, ప్రజలను డైవర్ట్ చెయ్యటానికి, అధికారం పక్షం, ప్రతిపక్షాన్ని అటాక్ చెయ్యటం మొదలు పెట్టింది. వరుస పెట్టి, ప్రతిపక్ష నాయకులని అటాక్ చెయ్యటం మొదలు పెట్టింది. మజ్జిగ ప్యాకెట్ల పై సిబిఐ ఎంక్వయిరీ ఆదేశించింది. తరువాత రోజే అచ్చెంనాయుడుని, ఆ తరువాత రోజు జేసి ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి, రాష్ట్రంలో రాజకీయ వాతవరణం మొత్తం మార్చేసింది. అయితే ఇందులో నిజంగా స్కాం ఉందా అంటే, తిప్పి తిప్పి కొడితే కోటి రూపాయలు కూడా ఆ విలువ ఉండదు. అయితే, ఇందలో కూడా వారి ప్రమేయం లేదని తెలుస్తుంది.
అయినా వారిని అరెస్ట్ చెయ్యటం, ఏదో అవినీతి చేసారు అని, తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లోకి నేట్టేసాం అని వైసిపీ అనుకున్న టైంలో, రివర్స్ లో, వైసీపీ నుంచి వచ్చిన ఆయనే, సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. తెలుగుదేశం నేతలను ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్న టైంలో, ఆయన ఏకంగా ఏబీఎన్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ లో చంద్రబాబు తరువాత ఉందే ఏబీఎన్. ఏబీఎన్ కే ఏకంగా ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంటర్వ్యూ ఇవ్వటం, అచ్చెంనాయుడు అరెస్ట్ అలా చెయ్యటం తప్పు అని చెప్పారు. అలాగే చంద్రబాబుని కలవనివ్వకుండా ఉండటం కూడా తప్పు అని, ఇది మానవహక్కులు ఉల్లంఘన అని ఆయన అన్నారు. ఇక విజయసాయి రెడ్డి కోర్టుల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన వారిని, వెనకేసుకుని రావటం తప్పు అని అన్నారు. రోజుకి ఒకరు అరెస్ట్ అవుతారు అంటూ వైసిపీ నేతలు అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు, తప్పు అని అన్నారు. ఇళ్ళ పట్టాల విషయంలో కూడా పెద్ద స్కాం ఉంది, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చాం అని అన్నారు. తనకి జగన్ ని కలిసే అవకాసం లేదు కాబట్టే, తాను ఇలా మీడియాకు ఎక్కాం అని అన్నారు. అయితే ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి టిడిపి నేతలను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతుంటే, ఏకంగా వైసిపీ ఎంపీనే సొంత పార్టీని ఇబ్బంది పెడుతూ, ఏబీఎన్ లాంటి చానెల్ లో ఇంటర్వ్యూ లు ఇచ్చి, మరింతగా వైసిపీని ఇబ్బంది పెడుతున్నారు.