వైసీపీ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై, ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా, లెటర్ లో ఆయన, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ, వెటకారం చేసినట్టు కనిపిచింది. లేఖ మొదట్లోనే, విజయసాయి రెడ్డిని సంబోధిస్తూ, "శ్రీ విజయసాయి రెడ్డి - నేషనల్ జనరల్ సెక్రటరీ టు స్టేట్ రికగ్-నైజెడ్ రీజినల్ పార్టీ" అంటూ సంబోధించటంలోనే, విజయసాయి రెడ్డిని ఎంత వెటకారం చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఇక పొతే, లేఖ చివర్లో కూడా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారు. నేను మీరు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్తాను, కాకపోతే ముందు మీరు, నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధనం ఇవ్వండి అని అన్నారు. ఒక వేళ, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోతే, నేను మీరు ఈ కమ్యూనికేషన్ చెయ్యటానికి అనర్హుడుగా భావిస్తూ, మీ పైన లీగల్ ప్రొసీడింగ్స్ కు వెళ్తానని, మీరు అందరినీ తప్పుదోవ పట్టించారని, మీ పై లీగల్ గా వెళ్తానని, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారు. ఇక చివరగా, విజయసాయి రెడ్డి పై, డైరెక్ట్ గా విమర్శలు సంధించారు.
మన పార్టీ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మీరు ప్రయత్నం చెయ్యకండి అని విజయసాయి రెడ్డిని కోరారు. ప్రజాస్వామ్య పధ్ధతికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, మీరే పార్టీకి ఎక్కువ నష్టం చేస్తున్నారు, మీకంటే పార్టీకి ఎక్కువ నష్టం చేస్తున్న వారు లేరు అంటూ, విజయసాయి రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే, ఎన్నికల కమిషన్ అనేది లేకుండా పోతుంది అంటూ, ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇక అంతకు ముందు కూడా, మాది ఒక ప్రాంతీయ పార్టీ, అయితే విజయసాయి రెడ్డి మాత్రం, నేను నేషనల్ జనరల్ సెక్రటరీ అని చెప్పుకుంటున్నారని, అని అక్కడ కూడా విజయసాయి రెడ్డి పై గురి పెట్టారు. ఇక ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు, పార్టీ క్రమశిక్షణా విభాగం చర్యలు తీసుకుంటుందని, క్రమశిక్షణా విభాగం గురించి ఈసికి చెప్పాలని, మరి క్రమశిక్షణా విభాగంలో విజయసాయి రెడ్డి ఎప్పుడు వచ్చారు ? ఆయన ఒక్కడే ఉన్నారా అంటూ, ప్రశ్నించారు మొత్తానికి, రఘురామ రాజు, విజయసాయి రెడ్డిని టార్గెట్ చెయ్యటం పై, ఆసక్తికర చర్చ జరుగుతుంది.