యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఈ రోజు రాజధాని రచ్చబండలో భాగంగా, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిన్న గాంధీ జయంతి నాడు, గాంధీ మళ్ళీ పుట్టాడు అంటూ, జగన్ మోహన్ రెడ్డిని గాంధీతో పోల్చుతూ, సాక్షిలో వచ్చిన కధనం పై ఆయన తనదైన శైలిలో స్పందించారు. గాంధీ మళ్ళీ పుట్టాడు అంటూ, చల్లా రామకృష్ణారెడ్డి రాసిన ఆర్టికల్ ని గుర్తు చేసుకుని, ఆయన గతంలో జంధ్యాల దర్శకత్వంలో సత్యాగ్రహం అనే సినిమా చూశానని, అలాగే నిన్న ఆయన రాసిన గాంధీజీ మళ్లీ పుట్టాడు అనే ఆర్టికల్ కూడా చదవాను అని, అయితే జగన్ గారిని గాంధీతో పోల్చటం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని రఘురామ రాజు అన్నారు. అయితే ఈ సందర్భంగా, మళ్ళీ పుట్టిన మా గాంధీకి ఓ విన్నపం అంటూ, జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. గత జన్మలో జగన్ గారు, ఎలా అహింసా వాదాన్ని పాటించారో, మళ్ళీ పుట్టిన గాంధీగా, అదే అహింసా వాదాన్ని ఫాలో అవ్వాలని కోరారు.
అమరావతి రైతులు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి, వారితో మాట్లాడాలని , వారితో ఎందుకు మళ్ళీ పుట్టిన గాంధీ చర్చలు జరపటం లేదో అర్ధం కావటం లేదని అన్నారు. ఇక సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత పై, రఘురామ రాజు స్పందించారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదని, కనీసం సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా, జేసీబీలతో ఎలా పడగొడతారని ప్రశ్నించారు. బాత్ రూమ్ లు కూడా కొట్టేస్తున్నారని, అడుగులు కూడా పోనివ్వకుండా, ఉండే ఇలాంటి అధికారులు ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ వ్యంగ్యంగా స్పందించారు. అయితే ఇదే అధికారులు, ఇళ్ళ స్థాలాల విషయంలో, ఆవ భూముల్లో జరుగుతున్న అవినీతి గురించి పట్టించుకోవటం లేదని, అది ఎవరికీ పట్టటం లేదని అన్నారు. సబ్బం హరి గోడ కూల్చితే ఏమి అవ్వదని, దృష్టి అవినీతి పనులు చేస్తున్న వారి పై పెడితే, అందరికీ మంచిదని, రఘురామ రాజు అన్నారు. ఆయన మాట్లాడిన వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/stPZViINcqY