సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ కు సంబంధించి, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటీషన్ పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డీ సహా, పిటీషన్ లో పేర్కొన్న ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ కు సంబంధించి, తన వైపు నుంచి వాదనలు వినాల్సిందిగా రఘురామకృష్ణం రాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజ్ అక్రమం అని చెప్పి, సిబిఐ కేసు నమోదు చేసిన నేపధ్యంలో, ఆ విషయాన్ని కోర్టుకు తెలియకుండా, కోర్టుకు చెప్పకుండా, ఏపి ప్రభుత్వం మైనింగ్ లీజ్ ను, నీటి సరఫరాను ఇవ్వటం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ముఖ్యంగా పిటీషన్ లో, తన వైపు నుంచి కూడా వాదనలు వినిపించేందుకు అవకాసం ఇవ్వాలని చెప్పి, ఆయన లీవ్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ లీవ్ పిటీషన్ లో ప్రతివాదులుగా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ తో పాటుగా, మైనింగ్ ప్రినిసిపల్ సెక్రటరీ, మైనింగ్ డైరెక్టర్ తో పాటుగా, కాలుష్య నియంత్రణా మండలిన కూడా ప్రతివాదులుగా చూపిస్తూ, పిటీషన్ దాఖలు చేసారు.
అయితే ప్రతివాదులు అందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారే చేసింది. ఈ కేసు విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ మొదటి నుంచి వివాదాల్లో ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, భూములు తీసుకోవటం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్పటం, తరువాత ఇబ్బందులు రావటంతో, తాము ఇచ్చిన భూముల్లో రైతులు మళ్ళీ సేద్యం ప్రారంభించటం, అప్పట్లో జగన్ వర్గీయులు వారి పై దా-డి చేయటం, రైతులు హైదరాబాద్ లోటస్ పాండ్ ముందు జగన్ కు వ్యతిరేకంగా ధర్నా చేయటం, ఇవన్నీ జరిగాయి. అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉన్న సందర్బంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, కొన్ని విషయాలు కోర్టుకు చెప్పకుండా దాచి, ఏకంగా ప్రభుత్వమే ఆ కంపెనీకి అనుకూలంగా పని చేసి, లీజు వచ్చేలా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీని పై టిడిపి పెద్ద గొడవే చేసింది. అయితే ఇప్పుడు రఘురామరాజు ఈ విషయం పై హైకోర్టులో కేసు వేయటంతో, హైకోర్టు ఇప్పుడు ఏమి చెప్తుందో చూడాల్సి ఉంది.