ఎంపీ రఘురామకృష్ణ రాజు పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చేసిన సందర్భంలో, సిఐడి రిమాండ్ లో, ఎంపీ రఘురామ పై పోలీస్ రిమాండ్ లో ఉన్న సమయంలో,ఆయన పై కొంత మంది ముసుగులు వేసుకుని వచ్చి, దా-డి చేసారు అంటూ, ఎంపీ రఘురామ కొడుకు భారత్, సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. దానికి సంబంధించి, సిబిఐ విచారణ జరిపించాలని కూడా భరత్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసు దాదపుగా ఏడాది నుంచి విచారణ రాకుండా ఆగిపోయింది. సుప్రీం కోర్టు ముందుకు విచారణకు రాలేదు. ఎందుకు రావటం లేదు అనేది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. అయితే ఎట్టకేలకు ఈ కేసు విచారణ సుప్రీం కోర్టు ముందుకు వస్తుంది. న్యాయమూర్తులు వినీత్ శరన్ ధర్మాసనం, ఈ రోజు కేసు విచారణ సందర్భంగా, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఈ కేసులో ఎందుకు జాప్యం జరిగింది ? కేంద్రం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు ? సిబిఐ కూడా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు అని చెప్పటం జరిగింది. అంతే కాకుండా, ఇటువంటి కీలకమైన కేసులకు సంబంధించి, త్వరతిగతిన విచారణ జరిగితే బాగుటుంది, త్వరతిగతిన కౌంటర్ కూడా దాఖలు చేస్తే బాగుటుందని, ధర్మాసనం అభిప్రాయపడింది.
దీంతో పాటు, కేంద్రానికి, సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయలని కూడా, కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత రెండు వారాల్లో సిబిఐ, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పైన, రీజాయిండర్ దాఖలు చేసేందుకు రఘురామకృష్ణరాజు తనయుడు భరత్‍కు అవకాశం ఇచ్చింది. ఆ తరువాత నాలుగు వారాలకు ఈ కేసుని మళ్ళీ లిస్టు చేయాలని రిజిస్ట్రీని కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి పైన జరిగిన పోలీస్ దా-డి విషయం పై సిబిఐ విచారణ చేపించాలి అనేది భరత్ తన పిటీషన్ లో పేర్కొన్న ప్రధానమైన డిమాండ్. ఈ పిటీషన్ పైనే ఈ రోజు విచారణ జరిగింది. ఈ పిటీషన్ చాలా రోజులగా పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాన్ని కూడా త్వరతిగతిన తేల్చాల్సిందే అని సుప్రీం కోర్టు ఈ రోజు అభిప్రాయపడింది. ఈ కేసు కనుక సిబిఐ విచారణకు వస్తే, ఆ రోజు ఎవరు కొట్టారు, వాట్స్ అప్ లో ఆ కొట్టటం చూసింది ఎవరు ? ఎందుకు కెమెరాలు పని చేయలేదు లాంటి అనేక అంశాలు బయటకు వస్తాయి.