ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జోరందుకున్నప్పుడు ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిందని, దీంతో ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపించి జీడీపీ వృద్దిరేటు మందగించిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. తాను పెద్దనోట్ల రద్దును చూడటంతో పాటు అధ్యయనం కూడా చేశానని, పెద్దనోట్ల రద్దుతో వృద్ధిరేటు పై గణనీయమైన ప్రభావం చూపించిందన్నా రు. 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జోరం దుకుందని, అదే సమయంలో భారత్ లో వృద్దిరేటు మందగించిం దని ఆయన ఇంగ్లీషు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దే కాకుండా జీఎస్టి అమల్లోకి తేవడం వల్ల కూడా వృద్ధిరేటు పై ప్రభావం చూపించిందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్దిరేటు 6.7 శాతంగా నమోదైంది.
రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న మిగులు నిల్వలు ప్రభుత్వానికి బదిలీ చేస్తే ఆర్‌బీఐ రేటింగ్‌కు భారీ గండి పడుతుందని రఘురాం రాజన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక వేళ ఆర్‌బీఐ రేటింగ్ ‘ఏఏఏ’ నుంచి కిం దికి దిగివస్తే సెంట్రల్ బ్యాంకు నిధులు సేకరించడం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీని ప్రభావం ఆర్థికవ్యవస్థపై పడుతుందని ఆయన వివరించారు. ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిల్వలు ప్రభుత్వానికి బదిలీ చేస్తే రేటింగ్‌లో కోత పడుతుందా అని ప్రశ్నించగా.. ఎంత మొత్తం బదిలీ చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతా నికి ఇది పెద్ద అంశం కాదని..అయితే రాబోయే రోజుల్లో ఇదే కీలక అంశంగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
మీరు గవర్నర్‌గా ఉన్న ప్పుడు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా.. ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దమొత్తంలో నగదు బదిలీ చేయాలని ఆర్‌బీఐ పై ఒత్తిడి పెంచుతుంటుందన్నారు. తాను ఆర్థిక వ్యవహారాల సలహాదారుడిగా ఉన్నప్పుడు ఆర్‌బీఐకి లేఖ రాసి ఎంత మొత్తం మీరు మిగులు నిల్వలు ఉంచుకోవాలను కుంటున్నారని లేఖలో పేర్కొనేవాడినని, తాను ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఒక కమిటిని ఏర్పాలు చేసి..పెద్ద మొత్తంలో మిగులు నిధులు తమ వద్ద ఉంచుకొని మొత్తం లాభాలను ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేసామని చెప్పారు. మూడు సంవత్సరాల పాటు తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అత్యధిక డివిడెండ్‌ను చెల్లించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లాభాల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలంటోందన్నారు.