ఢిల్లీలోని బీజేపీ, వైసీపీ ఎంపీలను టార్గెట్ చేసింది అంటూ, వార్తలు గుప్పుమంటున్న వేళ, జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకురుస్తున్నాయి. వైసీపీ ఏమి లేదు అని చెప్తున్నా, దాదపుగా 8 మంది ఎంపీలు బీజేపీ టచ్ లో ఉన్నారు అంటూ లీకులు ఇస్తున్నారు. మొన్నటి మొన్న సుజనా చౌదరి కూడా, బీజేపీతో, వైసీపీ ఎంపీలు టచ్ లో ఉన్నారని చెప్పారు. అయితే, సుజనా ప్రకటన పై, వైసీపీ ఎంపీలు భగ్గు మన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి, సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించారు. అయినా, కొంత మంది పై అనుమానపు మేఘాలు ఉన్నాయి. అందులో మొదటి వరుసలో ఉన్నది నరసరాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. పార్లిమెంట్ సమావేశాలకు జరిగే ముందే, జగన్ మోహన్ రెడ్డి, ఎంపీలు అందరితీ సమావేశం అయ్యి, పార్లమెంట్ లో ఏ అంశాలు ప్రస్తావించాలి అనేదాని పై, సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో, విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి చెప్పకుండా, ప్రధాని మోడిని కాని, కేంద్ర మంత్రులను కాని, కలవ కూడదు అని వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ చెప్పిన గీత దాటితే, షోకాజ్ నోటీసు ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఇద్దరు ఎంపీలను ఉద్దేశించి చేసారని, వైసీపీ క్యాంప్ లో గుసగుసలు వినిపించాయి. అయితే, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు మాత్రం, ఆయన పంధాలో ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ఈ రోజు ఆయన ఇచ్చిన జర్క్ తో, మరోసారి వైసీపీలో చర్చనీయంసం అయ్యింది. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళిన రఘరామకృష్ణ రాజు, ఉన్నట్టు ఉండి, భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరిని కలిసారు, ఏ పని మీద కలిసారు అనేది తేలియలేదు కాని, దాదపుగా గంట సేపు, ఆయన బీజేపీ కార్యాలయంలో గడిపినట్లు ప్రముఖ ఛానెల్స్ లో వార్తలు వచ్చాయి.
వార్తలే కాదు, ఆయన అక్కడ ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఒక వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగా, ఆయన బీజేపీ ఆఫీస్ లో ప్రత్యక్షం అవ్వటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆయన ఇప్పటి వరకు, ఏ అంశం పై, ఎవరితో కలిసింది, ఇంకా బయటకు చెప్పలేదు. ఒక పక్క పార్టీ అధినేత, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డికి చెప్పకుండా, ఎవరినీ కలవద్దు అని చెప్తే, రఘురామ కృష్ణ రాజు మాత్రం, ఏకంగా బీజేపీ ఆఫీస్ కే వెళ్ళటం, ఆసక్తికరంగా మారింది. మూడు రోజుల క్రితం, రఘురామ కృష్ణ రాజు, ప్రాధాని మోడీ తరాస పడిన సమయంలో, ఆయనకు పాదాభివందనం చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా, పార్లమెంట్ మొదటి రోజున, తెలుగు భాషకు అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ కార్యాలయానికే వెళ్లారు. మరి రఘురామాకృష్ణ రాజు ఏమి చెప్తారో చూద్దాం.