వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు, వైసిపీ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని పై, ఈ రోజు రఘురామకృష్ణం రాజు, ఒక వీడియో మెసేజ్ రూపంలో స్పందించారు. "ఈ రోజు మధ్యానం నాకు, మా పార్టీ నుంచి షోకాజ్ నోటీసు రావటం జరిగింది. చాలా మంది మీడియా మిత్రులు, నా వద్దకు వచ్చి, అభిప్రయం అడుగుతాం అన్నారు. కాని కరోనా సమయంలో, ఎందుకు అని, నేను రికార్డెడ్ వీడియో పంపిస్తున్నా. నాకు 18 పేజీల షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అందులో రెండు పేజీలు రిటెన్ షోకాజ్, మరో 16 పేజీలు  పేపర్ క్లిప్పింగ్స్ తో కలిపి పంపించారు. వాటి పై నన్ను సమాధానం అడగటం జరిగింది. నేను ఎప్పుడూ కూడా, మీరు అందరూ నన్ను చూస్తానే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు, నేను ఎప్పుడూ కాని, మా పార్టీని కాని, పార్టీ అధ్యక్షుడుని కాని, ఒక్క మాట అయినా విమర్శ చేసానా ? నేను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. అది ప్రజలు అందరికీ తెలిసిన సత్యం. ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం, చేపట్టిన పధకాలు, అనుకున్నట్టుగా, సజావుగా కొన్ని చోట్ల జరగటం లేదు అన్న దాని పై, నేను కొన్ని సూచనలు చేసాను."

"మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకటం లేదు కాబట్టి, ఆ కాల పరిమితి దాటి పోకుండా, మీడియాలో కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు విక్రయం కాని, ఇతర అంశాలు కాని, మా ముఖ్యమంత్రి గారికి, మీడియా ముఖంగా తెలియ చేయటం జరిగింది. ఇది ప్రభుత్వానికి సూచన తప్ప, ఇది పార్టీకి సూచన కాదు. నేను పార్టీని ఏనాడు ఒక్క మాట అనలేదు, మా పార్టీ అధ్యక్షుడు జగన్ గారిని ఒక్క మాట అనలేదు. అదే విషయం నేను, సవివరంగా, ఈ నోటీసులు రిప్లై గా, నేను రేపటి లోగా సమాధానం పంపిస్తున్నాను. నాకు ఏడు రోజులు సమయం ఇచ్చినప్పటికీ, నేను రేపే వివరణ పంపిస్తున్నాను. మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారికి పంపిస్తాను. పంపించిన తరువాత, మిగిలిన విషయాలు మీడియాకు తెలియచేస్తాను" అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read