వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, వరుసగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ముందు, పార్టీ లైన్ దాటవద్దు, ఇష్టం వచ్చినట్టు ఎవరినీ కలవద్దు, విజయసాయి రెడ్డికి చెప్పే ఎవరిని అయినా కలవండి అంటూ జగన్ చెప్పినా, డోంట్ కేర్ అంటూ తన పంధాలోనే వెళ్తున్నారు. పార్లిమెంట్ సమావేశాల మొదటి రోజే, తెలుగు భాషకి సపోర్ట్ గా మాట్లాడుతూ, జగన్ కు షాక్ ఇచ్చారు. ఇక తరువాత, కేంద్ర మంత్రుల్ని కలవటం, అలాగే ప్రధాని మోడీని కలిసి, పాదాభివందనం చెయ్యటం, ఇవన్నీ చూసాం. చివరగా ట్విస్ ఇస్తూ, సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ హోదాలో, ఢిల్లీలో అందరి ఎంపీలకు విందు ఇవ్వాటం, సంచలనం అయ్యింది. దీనికి బీజేపీ వారిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విందుకు విజయసాయి రెడ్డి మాత్రం రాలేదు. అసలు విజయసాయి రెడ్డికి, రఘురామకృష్ణం రాజుకి గ్యాప్ ఎక్కువగా ఉందని, అందుకే ఇలా ఒకరి పై ఒకరు పై చేయి సాధిస్తూ, ప్రవరిస్తూ, వైసీపీ పార్టీకి, జగన్ కు చెడ్డ పేరు తెస్తున్నారని, వైసీపీలో ప్రచారం.
అయితే, వీటి అన్నిటి పై, ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ రఘురామకృష్ణం రాజు కుండ బద్దలు కొట్టేలా వ్యాఖ్యలు చేసారు. తాను వైసీపీ పార్టీలో ఒక్క జగన్ మాట తప్పితే, ఇంకా ఎవరి మాట వినను అంటూ కుండ బద్దలు కొట్టారు. విజయసాయరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి ఇది వరిస్తుందని, వారి మాట కూడా వినాల్సిన అవసరం తనకు లేదని, మంచి అయినా చెడు అయినా అన్నీ జగన్ తోనే అంటూ చెప్పుకొచ్చారు. తనకు, జగన్ కు మధ్య ఉన్నవి లేనివి చెప్పి, ఇద్దరి మధ్య గొడవలు పెట్టటానికి, ఇద్దరు ముగ్గురు ప్రస్తావిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గారికి, తన పై పూర్తీ నమ్మకం ఉందని, అందుకే వీళ్ళు ఎన్ని చెప్పినా, తన పై అభిప్రాయం మారదు అంటూ చెప్పుకొచ్చారు.
తాను బీజేపీలోకి వెళ్తున్నాను అనేది ప్రచారం మాత్రమే అని, తాను చేరటం లేదని అన్నారు. అలాగే తనకు అన్ని పార్టీలతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని, వాటిని కొనసాగిస్తానని అన్నారు. నాకు ఒకరితో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్ చెప్తేనే వింటాను, వైవీ సుబ్బారెడ్డి చెప్పారని నోరు మూసుకుంటే నాకు ఓటు ఆయనొచ్చి వేస్తారా? ప్రజల కోసం ఎవరినైనా కలుస్తా అని అన్నారు. విజయసాయి రెడ్డి తనను పార్టీలోకి తీసుకు వచ్చారని, అక్కడితో ఆయన పని అయిపోయిందని, ఆయన పని ఆయనది, నా పని నాది అని, అసలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు, ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క ఢిల్లీలో విజయసాయి రెడ్డి పెద్ద దిక్కుగా ఉంటే, రఘురామకృష్ణం రాజు మాత్రం, విజయసాయి రెడ్డిని లెక్క చెయ్యకుండా మాట్లాడటం కొస మెరుపు.