రాఫెల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకునపెడుతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో అడుగు ముందుకేశారు. ఈ నెల 13న హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగులతో ఆయన సమావేశం కానున్నారు. రాఫెల్ ఒప్పందాన్ని హెచ్ఏఎల్ నుంచి లాక్కుని రిలయన్స్ డిఫెన్స్‌కు కట్టబెట్టారంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసింది. వేలాది కోట్ల విలువైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం రాహుల్ సమావేశంతో మరింత ఒత్తిడిలో పడేసే అవకాశాలున్నాయి.

rahul 10102018

ఫ్రాన్స్ సంస్థ దసాల్ట్ ఏవియేషన్‌కు ఆఫ్‌సెట్ భాగస్వామిగా ప్రభుత్వ సారథ్యంలోని హెచ్ఏఎల్‌ సంస్థను కాదని వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన రిలయన్స్‌ను ఎందుకు ఎన్నుకున్నారో ప్రధాని మోదీని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ఈ డీల్‌ను రిలయన్స్‌కు అప్పగించడం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు ఆవిరైపోయాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. ‘‘దేశంలోని యువకులు, వైమానిక దళం నుంచి సొమ్ము దొంగిలించి అంబానీ జేబులు నింపుతున్నారు. గత 70 ఏళ్లుగా హెచ్ఏఎల్‌కు విమానాల తయారీలో అనుభవం ఉంది. మిగ్, సుఖోయ్, జాగ్వార్ వంటి యుద్ధ విమానాలను సైతం హెచ్ఏఎల్ తయారుచేసింది. కాబట్టి యువత అప్రమత్తంగా ఉండాలి.

 

rahul 10102018

అనిల్ అంబానీ తన జీవితంలో ఎప్పుడూ విమానం తయారుచేయలేదు. రాఫెల్ ఒప్పందానికి కేవలం 10 రోజుల ముందు ఆయన ఓ కంపెనీని సృష్టించి ఈ కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు..’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో రాఫెల్ ఒప్పందం హెచ్ఏఎల్‌కు వెళ్లిందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘హెచ్ఏఎల్‌కు కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా.. ఇక్కడ యుద్ధ విమానాలు తయారైతే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. టెక్నాలజీ బదిలీ అవుతుంది. వైమానిక దళం మరింత బలోపేతం అవుతుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రూ.526 కోట్ల విమానం ధర రూ.1600 కోట్లు అయ్యింది..’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read