తెలంగాణ ఎన్నికల్లో కాకను మరింత పెంచుతూ ప్రజాకూటమి పోరుకేక పెట్టింది. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక్క వేదికనెక్కారు. జాతీయ కూటమికి తెలంగాణలో నాంది పలికారు. హైదరాబాద్ మహానగరం అందరిదీ అని.. ఈ నగరానికి ఓ విశిష్టమైన చరిత్ర ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. హైదరాబాద్‌ ప్రజలు కలిసిమెలిసి ప్రేమతో ఉంటారని.. ఐక్యతకు ఇదో చిహ్నంగా నిలుస్తుందని కితాబిచ్చారు. కలిసి మెలిసి ఉన్న ప్రజల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ విభేదాలు సృష్టిస్తారని మండిపడ్డారు. బుధవారం అమీర్‌పేటలో నిర్వహించిన మహాకూటమి ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 2004 ఎన్నికల సమయంలో చంద్రబాబు బాగా పనిచేశారని తాను చెప్పానని, మా వాళ్ళు విమర్శలు చేస్తుంటే, ఆయన చేసిన సేవకు గుర్తింపు ఇవ్వని అని చెప్పినట్టు, ఈ సందర్భంగా రాహుల్‌ గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారని చెప్పారు.

rahul 29112018 2

"జాతీయ ప్రయోజనాల కోసమే తెదేపాతో జత కట్టాం. 2004 సమయంలో అప్పుడున్న సీఎం చంద్రబాబు బాగా పనిచేశారంటూ అభినందించి సరైన గౌరవమిచ్చాం. కాంగ్రెస్‌, తెదేపా హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది. ప్రపంచంలో హైదరాబాద్‌ ఓ వెలుగు వెలిగిపోతుందంటే దానికి కారణం ఇక్కడి ప్రజల ఐకమత్యమే. ప్రజలు కలిసి, మెలిసి ఉంటే మోదీ చూసీ సహించలేరు. న్యాయమూర్తి కేసులో భాజపా జాతీయాధ్యక్షుడి పేరు వచ్చిందని.. సాక్షాత్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మీడియా ముందుకు వచ్చి మేం పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారంటే ఆర్బీఐ, సీబీఐ తదితర సంస్థల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యువతకు ఉద్యోగాలివ్వకుండా అనిల్‌ అంబానీ జేబులో రూ.30 వేల కోట్లు వేశారు. రఫేల్‌ కుంభకోణంపై విచారణ జరిపిస్తారనే భయంతోనే ప్రణాళికా ప్రకారం సీబీఐని నిర్వీర్యం చేశారు’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

rahul 29112018 3

హైదరాబాద్‌ అభివృద్ధి గురించి కేసీఆర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర నిధులన్నీ ఒక కుటుంబం చేతికే వెళ్లాయని ఆరోపించారు. దేశంలోని వ్యవస్థలన్నీ భాజపా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. న్యాయమూర్తి హత్య కేసులో భాజపా అధ్యక్షుడి పేరు వచ్చిందని, భాజపా వల్లే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారని విమర్శించారు. ప్రజలకు వస్తాయనుకున్న అచ్చేదిన్‌.. ప్రైవేటు కంపెనీలకు మాత్రమే వచ్చాయన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాలు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. రఫేల్‌ డీల్‌పై ఫ్రాన్స్‌ అధ్యక్షుడే చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read