రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల పై ఫైర్ అయ్యారు. మీ ధోరని ఇలా ఉంటే ఎలా అంటూ క్లాసు పీకారు. 2014 తరువాత, ఏపి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, అటు టిడిపిలోకి, ఇటు వైసీపీ లోకి వెళ్ళిపోయారు. ఒకటి అరా తప్ప, పెద్దగా నేతలు ఆ పార్టీలో లేరు. ఉన్న నేతలు కూడా, సరిగ్గా పని చెయ్యక పోవటంతో, రాహుల్ గాంధి వారి మీద ఫైర్ అయ్యారు. మనం తప్పు చేసాం, శిక్ష అనుభవిస్తున్నాం, అదే విధంగా బీజేపీ మనకంటే ఎక్కువ తప్పులు చేస్తుంది, అవి మీరు సరిగ్గా ప్రజల్లోకి తీసుకు వెళ్ళటం లేదు అని మొదలు పెట్టి, జగన్ మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ, కాంగ్రెస్ పార్టీలో కొంత మంది వ్యావహర తీరు పై, మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ వేరు అని, జగన్ మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినా విషయం మర్చిపోయారా అని అక్కడ ఉన్న నేతలకు తలంటారు.
వైసీపీ లక్ష్యంగా రాజకీయ పోరాటం చేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే.. పాలకపక్షం పై దాడి మాత్రమే కాదు, సరిగ్గా పని చెయ్యని ప్రధాన ప్రతిపక్షం వైసీపీని పన్నెత్తుమాట అనకపోవడమే ప్రధాన తప్పిదంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇదే సమయంలో దివంగత వైఎస్కీ.. జగన్‌కీ మధ్య మనస్థత్వాల్లో ఉన్న వైరుధ్యాలను జనానికి అర్థమయ్యేలా చెప్పాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా.. కాంగ్రెస్ సిద్ధాంతాల మేరకు పేద ప్రజల కోసం ప్రత్యేక పథకాలను రాజశేఖరరెడ్డి అమలు చేసిన విషయాన్ని ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించారు. ప్రధానంగా.. వైఎస్ తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీకి జగన్ అందిస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా రాహుల్ నూరిపోశారు.
వైఎస్ ఏనాడూ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వీడలేదని.. మరణించే వరకూ కాంగ్రెస్ సైనికుడిగానే ఉన్నారని, కానీ జగన్ మాత్రం కాంగ్రె్‌సపై కక్షగట్టారని పేర్కొన్నారు. వైఎ్‌సకు, జగన్‌కు మధ్య మనస్థత్వాల్లో ఉన్న అంతరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా వైఎస్ పై కాంగ్రెస్ కు మాత్రమే సర్వహక్కులూ ఉన్నాయంటూ ప్రజలకు వివరించాలని రాహుల్ సూచించారు. వీటన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ద్వారా పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లిన నేతలను వెనక్కు తీసుకురాగలగుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ-వైసీపీ చెలిమిపై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ సంప్రదాయ ఓటును వెనక్కు రప్పించగలమని.. రహుల్ అన్నారు. మొత్తానికి రాజకీయంగా బలీయం కావాలంటే పాలక పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై రాజకీయ పోరును పెంచాలని రాష్ట్ర నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు.