ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో, రాహుల్ గాంధి ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేస్తామని, అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టు గానే, అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాల్లో, కేవలం రెండు రోజుల్లోనే రుణ మాఫీ చేసి చూపించారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, ఛత్తీస్‌గఢ్‌లో సీఎం భూపేశ్‌ బఘేల్‌లు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ‘మాఫీ’ నిర్ణయాలను ప్రకటించారు. తాజాగా రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ సర్కారు కూడా అదే బాట పట్టింది. రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలోని రైతులందరి వ్యవసాయ రుణాలు మాఫీ చేసేంతవరకు మోదీని నిద్రపోనివ్వబోమని రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ఈ విషయంలో తాను, ఇతర ప్రతిపక్ష నేతలు ఒక్కటై పోరాడుతామన్నారు.

rahulgandhi 20122018 2

రైతుల దురవస్థలను ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ప్రభుత్వానిది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోతే 2019లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 100% తప్పనిసరిగా ఆ పని చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల విజయం సాధించిన రాష్ట్రాల్లో దీన్ని నిరూపించామన్నారు. ప్రధాని మోదీ నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా రైతుల రుణం మాఫీ చేయలేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. 15మంది పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము 10 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 6 గంటల్లోనే ఆ పని చేసి చూపించామని గుర్తు చేశారు. రాజస్థాన్‌లో రెండు రోజుల్లో రుణమాఫీ చేసామని వెల్లడించారు.

rahulgandhi 20122018 3

దేశంలో వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ చేయలేకపోతున్నారని ప్రధానిని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఆ పని ఎప్పుడు చేయబోతున్నారో హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఈ దేశం రైతులు, పేదలదే తప్ప కొద్దిమంది పెద్ద పారిశ్రామికవేత్తలది కాదు. రాత్రింబవళ్లు చమటోడ్చి, రక్తం ధారపోసి అన్నం పెడుతున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వారి గొంతు ప్రధానికి వినిపించడం లేదు. ఇప్పుడు మేం రైతుల వాణి వినిపించే పనిలోనే ఉన్నాం.’’ అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్‌ ఒప్పందం, పెద్దనోట్ల రద్దు ద్వారా దేశ ప్రజల సొమ్ము దోచుకున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ రెండు భారతదేశాలు తయారు చేశారని, ఒకవైపు పేదలు, కార్మికులు, రైతులు, బలహీనవర్గాలు, చిన్న వ్యాపారులు ఉండగా.. ఇంకోవైపు 15-20 మంది పెద్ద వ్యాపారవేత్తలున్నారని అన్నారు. రఫేల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్రమాణపత్రంలో ‘అచ్చుతప్పు’ పడినట్లు ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా ఇలాంటి మరెన్నో ‘అచ్చుతప్పులు’ బయటకొస్తాయని రాహుల్‌గాంధీ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read