ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు దొంగ’ అని సుప్రీంకోర్టు చెప్పినట్లు తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. రఫేల్‌ తీర్పుపై తప్పుగా వ్యాఖ్యానించినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార జోరులో చేసిన వ్యాఖ్యల్ని ప్రత్యర్థి పార్టీలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ఎప్పుడూ పేర్కొనలేదని అఫిడవిట్‌లో అంగీకరించారు. కోర్టును రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

supreme 22042019

రఫేల్‌ వివాదంపై సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరోపిస్తూ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు పేర్కొంది. దీనిపై ఏప్రిల్‌ 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే.

supreme 22042019

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం పత్రాలు కొన్ని లీక్ అయినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. లీక్ అయిన 3 పత్రాలను విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు ఈ నెల 10న ప్రకటించింది. వీటిని విచారణకు అనుమతించరాదని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రఫేల్‌ అవినీతిపై పోరాటంలో తమకు నైతిక విజయం లభించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దొంగతనం చేసినట్లు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read