మోదీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్‌ను ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా చేశార‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత హ‌ర్ష‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలోనూ జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన హ‌ర్షకుమార్ ని అక్ర‌మ కేసుల్లో ఇరికించి జ‌గ‌న్ రెడ్డి అరెస్ట్ చేయించారు. అప్ప‌టి నుంచీ అడ‌పాద‌డ‌పా వైసీపీ స‌ర్కారు తీరుపై విరుచుకుప‌డుతున్న హ‌ర్ష‌కుమార్ తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రోసారి మీడియా ముందుకొచ్చారు. మోదీ ఇంటి పేరున్న‌వారంతా దొంగ‌లేన‌ని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీకి కోర్టు జైలుశిక్ష విధించ‌డం, వెనువెంట‌నే పార్ల‌మెంటు స‌భ్య‌త్వం ర‌ద్దు చేయ‌డం వంటి ప‌రిణామాల‌పై హ‌ర్ష‌కుమార్ స్పందించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారిపై ప్రభుత్వమే కేసులు పెడుతోంద‌ని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం న్యాయ స్థానాల‌ని త‌న‌ చేతుల్లోకి తీసుకుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టిన వారినందరినీ మోదీ విదేశాలకు పంపేశార‌ని, రాహుల్‌ని లోక్‌సభ నుంచి సస్పెన్షన్ చేయటం దుర్మార్గం అని ఖండించారు. మోదీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్‌ను ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా కోర్టుల‌ని మేనేజ్ చేశార‌ని ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్య‌ల‌తో బీజేపీ-జ‌గ‌న్ మ్యాచ్ ఫిక్సింగ్ బంధం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read