కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల గాంధీని చూసి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి నేర్చుకునేది ఏమి ఉంటుంది అంటారా ? రాహుల్ మీద ఎలాంటి ఆరోపనులు ఉన్నా, అతనికి ఏమి తెలీదు అని హేళన చేసున్నా, ఒక్క విషయంలో మాత్రం జగన్ కంటే వంద రెట్లు నయం అనిపించుకున్నారు రాహుల్... ముత్తాత, నాయనమ్మ, తండ్రి ఈ దేశానికి ప్రధానులగా చేశారు, తల్లి 10 సంవత్సరాలు ప్రధాని లాంటి పవర్ ఉన్న వ్యక్తిగా చలామణి అయ్యారు... ఇంతటి ఘన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబానికి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రత్యర్ధి...
రాజకీయంగా నరేంద్ర మోడీతో ఎన్నో పోరాటాలు చేస్తున్నా, రాహుల్ ఏ రోజు లైన్ దాటలేదు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రధినిని అవమానిస్తూ మాట్లాడినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసారు రాహుల్.. ప్రధాని పదవి అంటే గౌరవం అని, ఆ పదవిని చిన్నబుచ్చేలా ప్రవర్తించను అని, పార్టీ వారు మాట్లాడినా సహించాను అనే సంకేతం ఇచ్చారు... ఇదే విషయం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాల్సింది... ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏకవచనంతో ఆడు ఈడు అనటం, కాల్చేస్తా, ఉరి వేస్తా, చెప్పుతో కొడతా, కాలర్ పట్టుకుంటా అంటూ సాక్షాత్తు జగనే అంటుంటే, ఇక ఆ పార్టీ నేతలు అయిన కొడాలి నాని, రోజా అయితే బూతులు కూడా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు...
ఇంత మాట్లాడినా వారిలో పశ్చాతాప్పం ఉండదు, మళ్ళీ మళ్ళీ అవే మాటలు మాట్లాడుతారు... సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న నేత, సుదీర్ఘ కలాం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తికి కనీసం, ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా, నోటికి ఏ బూతు వస్తే అది మాట్లాడుతూ, ముఖ్యామంత్రి పదవిని అవమాసిస్తున్నాం అనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు... జగన్ గారు, కుటుంబ అహంభావ ధోరణి, ఫ్యాక్షన్ మెంటాలిటీ పక్కన పెట్టి, రాహుల్ గాంధీని చూసి గౌరవప్రదంగా వ్యవహరించటం, హుందా రాజకీయాలు చెయ్యటం నేర్చుకోండి...