రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అఖిల భారత కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులేస్తోంది. మోడి వ్యతిరేక ఓటు చీలిపోకుండా పథకాలు సిద్ధం చేస్తోంది. మోడి ప్రభుత్వ ప తనం, తిరిగి బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమనే రెండు అంశాలే లక్ష్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కోవాలని ఆ పార్టీ భావి స్తోంది. ఇందు కోసం అవసరమైన త్యాగాలకు కూడా కాంగ్రెస్‌ సిద్దపడింది. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పతనమే తన లక్ష్యం తప్ప తనకధికారం కాదంటూ తేల్చిచెప్పేశారు. యూపీఏను గద్దెమీద కూర్చోబెట్టడమే తన ముందున్న ఏకైక కర్తవ్యంగా పేర్కొన్నారు. అవసరమైతే తాను ప్రధాని పదవికి దూరంగా ఉంటానని తేల్చి చెప్పేశారు. దేశంలో మరో సమర్ధుడు ముందుకొస్తే ప్రధాని పీఠం ఇచ్చేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసేశారు.

rahul 27072018 2

దీంతో రానున్న ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో మూడో ప్రత్యా మ్నాయం ఏర్పాటయ్యే అవకాశాలు కొరవడ్డాయి. పాలక ఎన్‌డీఏ, ప్రతిపక్ష యూపీఏల మధ్యే మరోసారి ఎన్నికల యుద్ధం జరగనుంది. దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న ఎన్‌డీయేతర పక్షాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌ పిలుపునకు స్పందించాలని భావిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల నుంచి కూడా నాయకులపై ఈ మేరకు ఒత్తిళ్ళు మొదలయ్యాయి. రాష్ట్రాల్లో అధికారంపై తమకు మమకారం లేదని కాంగ్రెస్‌ నిరూపించుకుంది. ఇందుకు తాజాగా జరిగిన కర్ణాటక ఉదంతమే ఉదాహరణ. తమకంటే తక్కువ సీట్లున్నా ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాధికారాన్ని అప్పగించి ముఖ్య మంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తమకు అభ్యంతరం లేదన్న రాహుల్‌ ఆలోచనలకు కర్ణాటకలో కార్యరూపం లభించింది.

rahul 27072018 3

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దీర్ఘకాలం కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆరితేరారు. ఆ తర్వాత కేంద్రంలో కూడా మంత్రిగా పని చేశారు. రెండోదఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమెకు ఆ రాష్ట్రంలో విపరీతమైన అనుచరగణముంది. ఈశాన్య రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి బలం పెరిగింది. తమ అధినేతను కేంద్రంలో కీలక పదవిలో చూసుకోవాలన్న తపన ఆ పార్టీ కార్యకర్తల్లో దీర్ఘకాలంగా కనిపిస్తోంది. ఇప్పుడు వారంతా మమతపై ఒత్తిళ్ళు పెంచారు. రాష్ట్ర రాజకీయాల మాట అటుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిందిగా పట్టుబడుతున్నారు. యూపీఏలో చేరి ప్రధాని అభ్యర్థిత్వానికి ప్రయత్నించాల్సిందిగా విజ్ఞప్తులు చేస్తున్నారు. దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేసిన బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కూడా ఇప్పుడు ఈ దిశగా పావులు కదుపుతున్నారు. ఆమెకు కూడా దీర్ఘకాలంగా ప్రధాని పీఠంపై ఆశ ఉంది. ఆ పార్టీకి ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు బీహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లోనూ గణనీయ సంఖ్యలోనే బలముంది. దీంతో యూపీఏలో భాగస్వామిగా చేరి జాతీయ ఎన్నికల అనంతరం ప్రధాని పదవికి పోటీ పడాలంటూ ఆమెపై ఒత్తిళ్ళు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read