వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని, అవినీతి కేసుల్లో ఉన్న జగన్‌ అధికారంలోకి వస్తే ఏమీ చేయలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ భరోసా సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని నీరుగార్చాలని యత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి కుయుక్తులను సహించేది లేదని అన్నారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఏపీతో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ఏం చేస్తామో చెప్పేందుకే రాహుల్‌ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు.

rg 31032019

న్యాయ పథకం పేదల జీవితాన్ని మారుస్తుందన్న రాహుల్ అందరికీ కనీస ఆదాయం కల్పించడమే కాంగ్రెస్‌కు లక్ష్యం అని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి ప్రకటన చేశారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఏపీకి న్యాయం చేయలేరన్నారు. విమర్శలు, నెగిటివిటీకి దూరంగా రాహుల్ ప్రసంగం సాగింది. పూర్తిగా దెబ్బతిన్న ఏపీలో... సానుకూలత సృష్టించుకునే వ్యూహంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మూలాలతో సహా తుడిచిపెట్టుకుపోయాక... మళ్లీ తొలి అడుగులేస్తున్నట్టుగా రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్‌కెందుకు ఓటెయ్యాలో చెప్పేందుకు రాహుల్ ప్రాధాన్యం ఇచ్చారు.

rg 31032019

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. జగన్ పై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనకు అధికారం అప్పగిస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. ఒకవేళ అధికారం అప్పగించినా అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఏపీకి న్యాయం చేరలేరని వ్యాఖ్యానించారు. మొత్తానికి రాహుల్ వ్యాఖ్యలతో జగన్ పై మరింత ఒత్తిడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తో రాజకీయం చేస్తున్న జగన్, ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి రెండు శాతం పుంజుకున్నా, జగన్ కు భారీ దెబ్బ తగలటం ఖాయం. మరో పక్క మోడీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, జగన్ కేసుల విచారణ స్పీడ్ అయ్యే అవకాసం కూడా ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read