రెండు రోజుల క్రితం, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ పరువుని దేశ వ్యాప్తంగా తీసాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అన్నమయ్య డ్యాం ప్రమాదం గురించి, ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించిన తీరు గురించి, రాజ్యసభలో దులిపేసారు. ఏపి తీరుతో, మన దేశానికి అంతర్జాతీయంగ పరువు పోయే పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపిలో హాట్ టాపిక్ అయ్యాయి. జగన్ ప్రభుత్వ అసమర్ధతను ప్రజల ముందు ఉంచాయి. నిన్నటి వరకు టిడిపి ఇదే మాట చెప్తే, రాజకీయం అని కొట్టేసిన వైసీపీకి, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్తే, ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే, మరో షాక్ ఇచ్చింది కేంద్రమా. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందటం లేదని అన్నారు. బకాయిలు ఉన్నాయని, అవి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించటం లేదని అన్నారు. దీంతో రైల్వే ప్రాజెక్ట్ ల పై ఆ ప్రభావం పడుతుందని రాజ్యసభలో తెలిపారు. నిన్న రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్ట్ ల తీరు పై, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్న అడగగా, దానికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో సహకారం అందించటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా ప్రకారం, డబ్బులు ఇవ్వటం లేదని అన్నారు.
అందుకే ఏపిలో రైల్వే ప్రాజెక్ట్ లు ముందుకు వెళ్ళటం లేదని అన్నారు. సహజంగా రైల్వే ప్రాజెక్ట్ లు, 50 శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఈ విషయంలో సహకారం అందించటం లేదని, కేంద్ర ప్రభుత్వం , రాజ్యసభ సాక్షిగా చెప్తుంది. మొత్తం ఆరు ప్రాజెక్ట్ ల విషయంలో, మొత్తం ఖర్చు రూ.15,846.35 కోట్లుకాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.746.63 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటికీ రూ.3,073.5 కోట్లు బకాయి ఉందని ఆయన రాజ్యసభలో తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ , భద్రాచలం-కొవ్వూరు లైన్, విజయవాడ-గుడివాడ-భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నిడదవోలు ప్రాజెక్ట్, కడప-బెంగుళూరు కొత్త లైన్, కోటిపల్లి-నరసాపురం లైన్, తుమకూరు-రాయదుర్గం లైన్, ఇలా అనేక ప్రాజెక్ట్ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సహకారం రావటం లేదని, కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చెప్పింది. ఏపి ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ఇది చూస్తూనే అర్ధం అవుతుంది.