ప్రతి నిమిషం రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటమే ధ్యేయంగా పని చేసే విజయసాయి, తన వంకర బుద్ధి రాజ్యసభలో కూడా చూపిస్తూ ఉంటాడు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రానికి ప్రశ్నలు వేస్తూ, అవి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. కాకపోతే, అవి రివర్స్ అయ్యి, చివరకు సెల్ఫ్ గోల్ అవుతాయి. ఇలాంటి ప్రశ్నలు కేంద్రాన్ని అడగటానికి, కేంద్రాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టటానికి మాత్రం ఉపయోగించడు. ఎంత సేపు రాష్ట్రం మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని, రుణ మాఫీ సరిగ్గా జరగలేదు కదా అంటూ, కేంద్రాన్ని ప్రశ్నలు అడిగారు. అయితే, అవతల నుంచి వచ్చిన సమాధానంతో, పాపం అవాక్కయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భేష్ అంటూ జవాబు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2014నుంచి 2017 వరకు, నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 394 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.బోర్‌వెల్స్ విఫలంకావడం, సాగు వ్యయం పెరగడం, ప్రైవేటు వడ్డీలు, ప్రకృతి వైపరీత్యాలు తదితర కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివిధ జిల్లాలకు చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ తెలిపిందన్నారు. అయితే ఇది వరకు మనకు తెలుసు, వేలల్లో పాపం రైతులు, ఆత్మహత్యలు చేసుకునే వారు. కాని, చంద్రబాబు సకాలంలో నీళ్ళు ఇవ్వటం, వివిధ రకాలుగా ఆదుకోవటంతో, కొంత వరకు రైతుల కష్టాలు తగ్గాయి.
మరో ప్రశ్న... 'ఏపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం 2014 నుంచి అమలు చేస్తోంది. వ్యవసాయ పంటలు, వ్యవసాయ అనుబంధ అవసరాల కోసం బంగారంపై తీసుకున్న రుణాలు కుటుంబానికి రూ.1.50 లక్షలు మించని వాటిని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు’ రూపాలా వివరించారు. కనీస మద్దతు ధరకే ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం సేకరణ జరుగుతోందని విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి సీఆర్ చౌధరి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులను ధాన్యం సేకరణ కేంద్రాలు, మిల్లర్లు, దళారులు దోచుకుంటున్నట్లు తమ శాఖ దృష్టికి ఏమీ రాలేదని పేర్కొన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా, ఏపి ప్రభుత్వం భేష్ అని కేంద్రం చెప్పటంతో, A2 గారికి ఏమి చెయ్యాలో అర్ధం కాక, షాక్ లో ఉండిపోయారు.