ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో, దర్శకుడు రాజమౌళి పొద్దున భేటి అయ్యారు. అమరావతి నిర్మాణాలకు, నర్మన్ పోస్టర్ ఇచ్చిన డిజైన్ లకు, రాష్ట్ర, దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సలహాలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం రాజమౌళిని కోరింది.

ఫ్లయిట్ ఆలస్యం అవడం వల్ల, అనుకున్న సమయానికి అంటే లేట్ గా, చంద్రబాబుతో భేటి అయ్యారు.. కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండటంతో, చంద్రబాబు కొద్ది సేపు చర్చించి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మరోసారి సీఎంతో, రాజమౌళి భేటీ అవుతారు.

దర్శకుడు రాజమౌళితో నిర్మాణాలు అని అమరావతి వ్యతిరేకులు హేళన చేస్తున్నారు. నిజానికి, రాజమౌళి నిర్మాణాల ప్లాన్ ఇవ్వరు, తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్ లలో చెయ్యాల్సిన మార్పులు చెప్తారు... తెలంగాణాలో యాదాద్రి ఆలయం మొత్తం, సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి డిజైన్ చేశారు... హైదాబాద్ లో కూర్చున్న తెలంగాణా మేధావులు, ఇది తెలుసుకుంటే మంచిది... సినిమా వాడికి, డిజైన్ లు గురించి ఎందుకు అనే వాళ్ళు, హైదరాబాద్ లో కులుకుతూ, ఆంధ్ర రాష్ట్రానికి సియం అవ్వటం ఎందుకు అనే లాజిక్ మర్చిపోయారు..

రాజమౌళి, వీళ్ళందరికీ దిమ్మ తిరిగేలా, ప్రపంచ స్థాయి రాజధాని కోసం, నర్మన్ పోస్టర్ తో, కలిసి, అటు ఆధునికత, ఇటు, మన తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆకృతులు ఇవ్వాలని ఆశిద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read