నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోర్ కాపిటల్ ఏరియాలోని బిల్డింగ్స్ కోసం, రాజమౌళి సలహ కూడా తీసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయం పై, అమరావతి ద్వేషి అయిన జగన్ పార్టీ, వేరే రకంగా సృష్టించి, రాజమౌళి చేత రాజధానిలో సినిమా సెట్టింగ్ వేస్తున్నారు అనే ప్రచారం చేస్తున్నారు.
నిజానికి నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్ లకు, తెలుగుదనం అద్దటానికి, మన సంస్కృతి ప్రతిబంభించాటానికి రాజమౌళి సలహాలు తీసుకోమన్నారు ముఖ్యమంత్రి. నిన్న రాజమౌళి, అమరావతి వచ్చి ముఖ్యమంత్రితో చర్చించారు కూడా. అయినా సరే, జగన్ పార్టీ, జగన్ సాక్షి ఛానల్, జగన్ పైడ్ సోషల్ మీడియా బ్యాచ్, అమరావతి మీద ఏడుస్తూనే ఉన్నారు... రాజామౌళి చేత రాజధాని డిజైన్ చేపిస్తున్నాడని, విషం చిమ్మారు.
వీరందరికీ, లాచి పెట్టి కొట్టే సమాధానం ఇచ్చాడు రాజమౌళి. ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ, తనను కన్సల్టెంట్‌గా, డిజైనర్‌గా, సూపర్‌వైజర్‌గా నియమించారంటూ వస్తున్న వార్తలన్నీ తప్పు అన్నారు.నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది అని పేర్కొన్నారు. అమరావతిపై వారు సమర్పించిన డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయని.. ఆ డిజైన్స్ సీఎం చంద్రబాబుకి కూడా ఎంతగానో నచ్చాయన్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ మరింత ప్రత్యేకంగా ఉండాలని సీఎం భావిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆలోచనలను, విజన్‌ను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధలకు వివరించడమే తన పని అని క్లారిటీ ఇచ్చారు. చరిత్రాత్మక ప్రాజెక్టు రూపకల్పనలో తనకు వచ్చిన ఈ అవకాశాన్ని చిన్న సాయంగానే భావిస్తానని చెప్పారు రాజమౌళి.
ఇప్పటికైనా పైడ్ సోషల్ మీడియా బ్యాచ్, హైదరాబాద్ లో కుర్చినే మేధావులు, సైకో చానల్స్ అండ్ సైకో పార్టీ, మా అమరావతి మీద ఏడవటం ఆపండి... వీలయితే, మై బ్రిక్, మై అమవారతిలో పది రూపాయలు పెట్టి ఒక ఇటుక కొని, అమరావతిలో మీరు భాగస్వామ్యం అవ్వండి, అమరావతి మీద మీరు చేసిన పాపాలు పోతాయేమో...