రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు.. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలుగోడి సత్తా చూపించి, బాహుబలితో ఇండియన్ సినిమా కీర్తి పతాకను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. మన అమరావతి కోసం కూడా ఒక చెయ్యి వేసాడు రాజమౌళి. రాజమౌళి అంటే ఒక క్రేజ్. రాజమౌళి నుంచి కంప్లిమేంట్ వచ్చింది అంటే అదో కిక్కుగా ఫీల్ అవుతారు సినిమా వాళ్ళు. అలాంటి రాజమౌళి మన విశాఖపట్నం పై ప్రశంసలు కురిపిస్తూ, విశాఖపట్నం నగర అభివృద్ధి సంస్థ (వుడా) అధికారులను మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు. రాజమౌళి తాజాగా విశాఖపట్నం వెళ్లారు. వైజాగ్ లో తిరుగుతూ, రోడ్ల అందాల్ని, శుభ్రతను చూసి ఫిదా అయిపోయాడు. చాన్నాళ్ల తర్వాత వైజాగ్ వచ్చానని.. ఇక్కడి రోడ్లు చాలా పరిశుభ్రంగా.. పచ్చదనంతో నిండి ఉన్నాయని.. చాలా సమర్థవంతంగా వీటిని నిర్వహిస్తున్నారని.. ఇందుకు వుడాను అభినందిస్తున్నానని రాజమౌళి ట్వీట్ చేశాడు.

rajamouli 30052018 2

మూడేళ్ళ క్రిందట, మహా నగరం విశాఖ హుద్‌హుద్‌ తుపాన్‌ దెబ్బకు కుదేలైపోయింది. ఎదుగుతున్న సుందర నగర భవిత ఇక ఇప్పుడు అంధకారమే అనుకున్నారు అందరూ... కాని అక్కడ ఉన్నది చంద్రబాబు... అంత విద్వంసం సృష్టించిన ప్రచండమైన తుఫాను సైతం ఆశ్చర్యపోయే విధంగా, కేవలం 10 రోజుల్లో అంతా నార్మల్ అయిపొయింది... ముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం మొత్తం, ఆ పది రోజుల పాటు, వైజాగ్ లోనే ఉండి, నష్ట నివారణ చర్యలు చేపట్టారు... సర్వం కోల్పోయిన ప్రజలకు భరోసా ఇచ్చారు... కట్ చేస్తే... ఈ మూడు ఏళ్ళలో వైజాగ్, పడింది, లేచింది, నిలబడింది, ప్రకృతి కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు పరిగెడుతుంది... స్వచ్ఛ భారత్ పథకం కింద అందజేసే స్వచ్ఛ సర్వేక్షణ 2017 ర్యాంకులలో, దేశంలోనే మూడువ సుందర నగరంగా ర్యాంకు సాధించింది.... ఇది ఆంధ్రావాడి దమ్ము అంటే...

rajamouli 30052018 2

తుఫానుకి అతలాకుతలం అయిన విశాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 3వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూ, బ్రిక్స్‌ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఏకంగా, రెండో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చి, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని మరోసారి నిరూపించింది. వైజాగ్ క్రికెట్ ఆడటానికి వచ్చిన విదేశీ క్రికెటర్లు అయినా, రాజమౌళి లాంటి సినిమా వారు అయినా, వైజాగ్ లో రోడ్ల శుభ్రతని పొగడకుండా ఉండలేరు. మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎప్పటికీ, శాంతి భద్రతలతో, పూర్తి ప్రశాంతంగా ఉండాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read