చాలా రోజుల తరువాత కేంద్రంలోని బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడారు. ఎప్పటిలాగే మీకు వేల కోట్లు, లక్షల కోట్లు ఇచ్చేసాం అని అన్నారు. మన రాష్ట్రానికి వచ్చింది సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ‘‘ కాంగ్రెస్‌ ఉచ్చులో చిక్కుకున్నవారెవరూ బయటపడలేరు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. ఎన్డీఏను చంద్రబాబు ఎందుకు వీడారో ఇప్పటికీ నాకు తెలియదు. విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నాం."

rajnadh 16102018 2

"ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇస్తున్నాం. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీనే కాదు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం. విజయవాడ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశాం. తెలంగాణకు నాలుగు బెటాలియన్లు ఇస్తే ఏపీకి 8 ఇచ్చాం. అన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తీసుకోవడానికి వాళ్లే సిద్ధంగా లేరు.’’ అని అన్నారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు.

rajnadh 16102018 3

భాజపా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. భాజపాకు ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీకీ ఉండరన్నారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 2014లో భాజపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంకల్పాలు తీసుకున్నామని, కూటమి మిత్ర ధర్మం పాటించేందుకు భాజపా పూర్తిస్థాయిలో కృషిచేసిందని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read