ఫిబ్రవరి ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, పార్టీల మధ్య సమన్వయం కోసం, అలాగే పార్లమెంట్ లో ఏ అంశాలు ప్రస్తావించాలి అనే అంశం పై, ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, అన్ని పార్టీల నేతలు పాల్గున్నారు. వారి వారి సమస్యల గురించి ప్రస్తావిస్తూ, ఈ విషయాల పై, పార్లమెంట్ లో చర్చించాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చే సరికి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, గల్లా జయదేవ్, అలాగే శ్రీకాకుళం ఎంపీ రాం మోహన్ నాయుడు పాల్గున్నారు. అలాగే వైసీపీ నుంచి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీ మిథున్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గున్నారు. అయితే ఈ సందర్భంలో, తెలుగుదేశం పార్టీ నేతలను మాట్లాడమని కోరగా, వారు రాష్ట్రంలో జరుగుతున్న వాటి పై స్పందించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ, ఎక్కడా లేని విధానాన్ని తీసుకువచ్చి, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టారని పేర్కొన్నారు.

అమరావతి రాజధాని అని కేంద్రానికి చెప్పి, ప్రధాని మోడీ స్వయంగా వచ్చి శంకుస్థాపన కూడా చేసారని, అలాగే కేంద్రం 1500 కోట్లు కూడా రాజధాని నిర్మాణానికి ఇచ్చిందని గుర్తు చేసారు. అమరావతిలో జరుగుతున్న వివిధ పనులు గురించి వివరించారు. రాజధాని అంశంతో పాటుగా, తనకు అడ్డుగా ఉందని, ఏకంగా శాసనమండలినే జగన్ రద్దు చేసారని, రాజధాని మార్పు అంశం, అలాగే శాసనమండలి రద్దు అంశం కూడా, పార్లమెంట్ లో చర్చించాలని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కేంద్రాన్ని కోరారు. అలాగే అమరావతిలో ఉన్న పరిస్థితి, గత 45 రోజులుగా, లక్ష మందికి పైగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటం, పోలీసులు అకారణంగా వచ్చి శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం పై చేస్తున్న దాడులు గురించి కూడా ప్రస్తావించారు.

ఈ సమయంలో, వైసీపీ పార్టీ నేతలు, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కలుగచేసుకుని, రాజధాని మార్పు అంశం అయినా, లేక శాసనమండలి అయినా, అవన్నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అని, వీటిని పార్లమెంట్ లో చర్చించాల్సిన పని లేదని అన్నారు. అయితే టిడిపి ఎంపీలు మాట్లాడుతూ, అమరావతిని ఎంపిక చేసిన విషయంలో, కేంద్ర సహకారమే తీసుకుని చేసామని, అందుకే ఇప్పుడు కేంద్రం దృష్టికి తీసుకు వస్తున్నామని అన్నారు. ఈ సందర్భంలో, ఇరు పార్టీల నేతలు మాట మాట పెరగటంతో, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కల్పించుకుని, ఇద్దరినీ ఆపారు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలకు క్లాస్ పీకారు. టిడిపి ఎంపీలు చేపుంటే, మీరు ఎందుకు అడ్డు పడుతున్నారు, ఆ విషయం చర్చించాలో, వద్దో నిర్ణయం తీసుకునేది మేము, ఇక్కడ ప్రస్తావన మాత్రమే చేసారు, వారిని చెప్పనియ్యండి, చర్చలు జరగకుండానే గొడవ చేస్తారు ఎందుకు అని వైసీపీ నేతలకు క్లాస్ పీకారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read