డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు రూ.400 కోట్లను ఎపిఎన్ఎస్ఎస్సిలకు మళ్లించడంపై రాజభవన్ స్పందించింది. మళ్లించిన నిధులను వెనక్కి ఇవ్వాలంటూ యూనివర్సిటీకి చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందనకు ఉద్యోగ సంఘాల జెఎసి ఈ మెయిల్ లో ఫిర్యాదు చేసింది. అప్పటికే ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉద్యోగుల ఆందోళనపై రాజ్ భవన్ అధికారులు ఆరా తీశారు. వర్సిటీ నిధుల మళ్లింపు వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. రాజభవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యామ ప్రసాదు సిఎంఓ నుంచి సోమవారం పిలుపు వచ్చింది. విసి శ్యామ ప్రసాద్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సిఎంఓకు వెళ్లి సుమారు రెండున్నర గంటలపాటు సిఎంఓలో అధికారులతో సమావేశమైనారు.
Advertisements