జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, అందరూ వచ్చి ఆయన ముందు వాలిపోవలాని, కలలు కంటున్నారు వైసీపీ నాయకులు. మా నాయకుడు ఈ దేశంలోనే గొప్ప నేత అన్న విధంగా మాట్లాడుతూ, ఒక విధంగా జగన్ పరువు వీళ్ళే తీస్తున్నారు. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు, ఐఏఎస్ , ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి పరిచయం చేసుకుంటారు కాని, సినిమా ఇండస్ట్రీ రాలేదు, క్రికెటర్ లు రాలేదు, కిరాణా కొట్టు వాడు రాలేదు అంటూ, వైసీపీ నేతలు గొడవ చెయ్యటం ఎందుకో మరి. ముఖ్యంగా సినీ నటుడు, థర్టీ ఇయర్స్ పృథ్వీగా పేరు తెచ్చుకున్న పృధ్వీ, ఈ విషయం పై చేసిన వ్యాఖ్యలు కొంత చర్చకు దారి తీసీయి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, తెలుగు సినీ ఇండస్ట్రీ పేదలకు ఇష్టం లేనట్టుగా ఉంది అంటూ మొన్న పృధ్వీ సంచలన వ్యాఖ్యలు చేసారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, సినీ పెద్దలకు తెలుసా ? తెలిస్తే వచ్చి జగన్ ను ఎందుకు కలవలేదు అంటూ ప్రశ్నించారు. అయితే దీని పై సినీ ఇండస్ట్రీ మాత్రం, ఘాటుగా స్పందిస్తుంది. అసలు జగన ముఖ్యమంత్రి అయితే, మేము వెళ్లి ఎందుకు కలవాలి, అనే విధంగా సినీ ఇండస్ట్రీ స్పందిస్తుంది. మూడు రోజుల క్రితం, వైసీపీ పార్టీకి చెందిన నేత, జగన్ అంటే చెవి కోసుకునే, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఈ వ్యాఖ్యల పై స్పందించారు. పృధ్వీ మాట్లాడిన మాటలు తప్పని అన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి జగన్ అంటే ఇష్టమే అని అన్నారు. జగన్ సియం అయితే కలవాలని రూల్ లేదు కదా, పృధ్వీ ఎదో ఫ్లో లో అని ఉంటాడులే అని సర్ది చెప్పారు. అయితే, నిన్న తిరుమల వచ్చిన ప్రముఖ హీరో రాజేంద్ర ప్రసాద్, పృధ్వీ వ్యాఖ్యల పై ఇంకా కొంచెం ఘాటుగా స్పందించారు.
మేము జగన్ ను ఎందుకు కలవాలి ? మేము ఏమన్నా పెట్టుబడి దారులమా ? మేము కళాకారులం అంటూ ఘాటుగా బదులిచ్చారు. జగన్ ని కలిసే అవసరం ఉంటే కలుస్తాం అని అన్నారు. కేసీఆర్ ని ఎలా గౌరవిస్తామో, జగన్ ని కూడా అలాగే గౌరవిస్తామాని అన్నారు. కాని, ఇలా కలవాలి కలవాలి అనటం ఏంటి అంటూ రాజేంద్ర ప్రసాద్ ఘాటుగా స్పందించారు. నిజానికి ఈ విషయంలో వైసీపీ నేతలది ఓవర్ ఆక్షన్ అనే చెప్పాలి. వీళ్ళ మాటలతో, జగన్ మోహన్ రెడ్డికి మరింత చెడు చేస్తున్నారు కాని, మంచి చెయ్యటం లేదు. వీళ్ళ భజన కోసం, జగన పరువు వీళ్ళే తీస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజల్లో లేని చర్చను పెట్టి, నిజంగానే వాళ్ళు ఎందుకు వెళ్లి జగన్ ను కలవలేదో, జగన్ అంటే లెక్క లేదు అనుకుంటా అని ప్రజలు అనుకునేలా వీళ్ళే అవకాసం ఇస్తున్నారు. జగన్ ఇచ్చిన పని సవ్యంగా చెయ్యకుండా, ఎక్కువ భజన చేస్తే, పర్యావసానాలు ఇలాగే ఉంటాయి.