అసెంబ్లీని కౌరవ సభగా మార్చి, చంద్రబాబు సతీమణిని అనరాని మాటలు అంటూ, వికటాట్టహాసం చేస్తూ, సభలో చంద్రబాబుని అవమానించి, ఆయన సతీమణిని కించపరిచిన ఘటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా కలిచివేసింది. దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు, ఈ విషయంలో మద్దతు లభిస్తుంది. ఇతర రాష్ట్రాల నాయకులు ఫోన్ లు చేసి, చంద్రబాబుని ఓదారుస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అంటే ఒక విజన్ కి చిరునామాగా చూసిన దేశ నాయకులు, ఆయన్ను అలా చూసి చలించిపోయారు. తమిళనాడు సూపర్ స్టార్ట్ రజనీకాంత్ చంద్రబాబుని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ నేతలు, చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మీడియాలో చుసిన రజనీకాంత్, శనివారం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి, విచారం వ్యక్తం చేసారు. చంద్రబాబుకు ధైర్యం చెప్తూ, ఈ ఘటన నుంచి బయటకు వచ్చి, ప్రజా సేవ కొనసాగించాలని, చంద్రబాబుకు హితవు పలికారు. ఇక తమిళనాడుకు చెందిన న్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. అన్నాడీఎంకే మాజీ ఎంపీ మైత్రేయన్, చంద్రబాబు పట్ల వైసీపీ వ్యవహరించిన తీరుని ఆక్షేపించారు. ఎన్టీఆర్ కుటుంబంతో తమకు 1984 నుంచి పరిచయం ఉందని అన్నారు.
ఎన్టీఆర్ కుమార్తెను అసెంబ్లీ వేదికగా దుర్భాషలాడటం మీడియాలో తెలుసుకుని చాలా బాధ పడినట్టు చెప్పారు. ఈ ఘటనను ఖండిస్తున్నానని అన్నారు. చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి, ఆయకు ధైర్యం చెప్పినట్టు చెప్పారు. ఇక చంద్రబాబుకు తెలంగాణా నుంచి కూడా మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గా రెడ్డి, జరిగిన ఘటనను ఖండించారు. అరికెపూడి గాంధీ కూడా చంద్రబాబుకు మద్దతు నిలిచారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జరిగిన ఘటనను ఖండించారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కూడా జరిగిన ఘటన పై విచారం వ్యక్తం చేసారు. ఏపి అసెంబ్లీలో సంస్కార హీనులు చొరబడ్డారని అన్నారు. ఇది తెలుగు జాతి చరిత్రలోనే ఒక దుర్దినం అని అన్నారు. బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, మరో ఎంపీ సియం రమేష్, మాజీ మంత్రి పురందేశ్వరి కూడా వైసీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి నీచ సంస్కృతికి చరమ గీతం పాడాలని అన్నారు.