జగన్ మోహన్ రెడ్డికి, బీజేపీ వైపు నుంచి కష్టాలు వస్తూనే ఉన్నాయి. సహజంగా, ఒక పార్టీ అధినేత, మరో పార్టీని లెక్క చేసే పని ఉండదు కాని, ఇక్కడ పరిస్థితి వేరు. తన పై ఉన్న కేసులు వల్ల, బీజేపీని, ముఖ్యంగా, మోడీ, అమిత్ షాలకు కోపం రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. కళ్ళ ముందే శశికళ ఎపిసోడ్ ఉంది. అలాగే బీజేపీతో పెట్టుకునే, చంద్రబాబు ఓడిపోయారనే వాదన ఉంది. అందుకే బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ జగన్ వస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం, మాటి మాటికి జగన్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ, బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ, జగన్ కు చిరాకు తెప్పిస్తున్నారు. తాజగా జరిగిన టిటిడి బోర్డు నియామకంలో జరిగిన పొరపాటుతో, ఇప్పుడు జగన్ పై, ఒక సీనియర్ బీజేపీ నేత, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు ఫిర్యాదు చేసారు. అంతే కాదు, త్వరలోనే సుప్రీం కోర్ట్ లో కూడా ఫిర్యాదు చేస్తానని చెప్తున్నారు.

ttd 06102019 2

మొన్న కొత్త టిటిడి బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులే బయట రాష్ట్రాల వారికి, ఎక్కవు ప్రాధన్యత ఇచ్చారు. ఈ తరుణంలోనే టీటీడీ పాలకమండలి పాలకవర్గంలో సభ్యునిగా ఎన్నికయ్యారని, జాతీయ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సలహా మండలి సభ్యుడు రాజేష్‌శర్మకు నియమిస్తున్నట్టు ఫోన్ ద్వారా మెస్సేజ్ పంపి, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది టిటిడి. అయితే పొరపాటున ముంబైలో ఉన్న రాజేష్ శర్మకు బదులు, ఢిల్లీలో ఉన్న రాజేష్ శర్మకు పంపించమని, సారీ చెప్పి, ఈయన్ను పంపించి వేసారు. అయితే, ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రాజీవ్ శర్మ, ఇది తనకు తీవ్రంగా జరిగిన అవమానంగా భావించారు. వెంకటేశ్వర స్వామి తనకు అవకాసం ఇస్తే, జగన్ దాన్ని అడ్డుకున్నారని, ఆరోపిస్తున్నారు.

ttd 06102019 3

శనివారం రాజేష్ శర్మ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏపి ప్రభుత్వం నియమించిన టిటిడి పాలకమండలి సభ్యుల నియామకాల పై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. తాను ఉన్నత చదువులు చదువుకుని, ఒక ప్రొఫెసర్‌గా ఉంటూ గత రెండు దశాబ్ధాలుగా బీజేపీలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పారు. తనను టీటీడీ పాలకమండలి సభ్యునిగా నియమించినట్టు టీటీడీ చైర్మెన్ నుంచి ఫోన్ ద్వారా మెస్సేజ్ అందినట్టు చెప్పారు. సెప్టెంబర్ 3న ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారన్నారు. అయితే అక్కడకు వెళ్లాక తనని కాదని, తన పేరుతోనే ఉన్న ముంబాయికి చెందిన మరో వ్యక్తికి పాలకమండలి సభ్యునిగా నియమించారని, తనని మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ఇలా జరగటం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారయాని, ఈ అంశంపై ఇప్పటికే తాను ప్రధాని నరేం ద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలియజేసినట్టు తెలిపారు. తనకు కేటాయించిన పాలకమండలి సభ్యుడి హోదాను డబ్బులు కోసం వేరొకరికి అమ్ముకున్నారని ఆరోపించారు. దీని పై సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్తున్నట్టు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read