చంద్రబాబు ఎన్డీయే నుంచి వెళ్ళిపోవటం పై, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పొతే పోనివ్వండి అన్నట్టు మాట్లాడుతుంటే, వాళ్ళ పార్టీ సీనియర్ నాయుకులు మాత్రం, వేరే విధంగా స్పందిస్తున్నారు.. నిన్న అమిత్ షా మాట్లాడుతూ, చంద్రబాబు ఏమన్నా పెద్ద లీడరా ? మిగతా రాష్ట్రాల్లో వెళ్లి ప్రచారం చేస్తే, ఎవరన్న చంద్రబాబు మాట వింటారా ? ఒరిస్సా వెళ్లి చంద్రబాబు ప్రచారం చేస్తే మాట వింటారా ? అంటూ చంద్రబాబు పై ఎగతాళిగా మాట్లాడారు.. అంతే కాదు, అమరావతి పై, నిధుల పై, UCల పై కూడా అమిత్ షా స్పందిస్తూ, అసలు అమరావతిలు ఏమి ఉంది ? మేము ఇచ్చిన దాంట్లో పైసా ఖర్చు పెట్టలేదు.. UCలు ఇవ్వలేదు అంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ, చంద్రబాబు అసలు ఒక నాయకుడే కాదు, అన్నట్టు స్పందించారు..

rajnadh 29052018 2

ఇది ఇలా ఉంటే కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్‌ మాత్రం, మరో రకంగా స్పందించారు. ‘‘ఎన్డీయే నుంచి తెలుగు దేశం పార్టీ వైదొలగి ఉండాల్సింది కాదు. అది సంతోషించదగిన పరిణామం కాదు. చంద్రబాబు బయటికి వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది’’ అని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఎకనామిస్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘ఎన్డీయేలోని పార్టీలు బీజేపీ వైఖరిపట్ల సంతృప్తితో లేవు. శివసేన తొలి నుంచి వ్యతిరకేతతో ఉంది. ఇటీవల టీడీపీ కూడా బయటికి పోయింది. వాజపేయి హయాంలో ఇప్పుడు లేదు. ఎందుకిలా?’ అని ప్రశ్నించగా... ‘‘ఆ పార్టీలపై కొన్ని ఒత్తిళ్లు ఉండవచ్చు. కానీ అవేమంత పెద్దవి కాదు. ప్రతీ కుటుంబంలో ఇలాంటివి జరుగుతాయి’’ అని తెలిపారు.

rajnadh 29052018 3

ఒక పక్క అమిత్ షా, రాం మాధవ్, జీవీఎల్ లాంటి నాయకులు, చంద్రబాబు పై విరుచుకు పడుతుంటే, చంద్రబాబు వెళ్ళిపోవటం వల్ల, ఎంతో మంచి జరిగింది అని చెప్పుకుంటుంటే, రాజ్‌నాథ్‌ సింగ్ మాత్రం, చంద్రబాబు వెళ్ళిపోవటం సంతోషించదగిన పరిణామం కాదు అంటూ, చంద్రబాబు ఎలాంటి నాయకుడో చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో, బీజేపీకి ఎలాగూ మెజారిటీ రాదు... ప్రాంతీయ పార్టీలు అవసరం ఎంతో ఉంటుంది. మరో పక్క అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం అవుతున్న తరుణంలో, మమత లాంటి నేతలే, చంద్రబాబుని ఆ ఫ్రంట్ కు నేతృత్వం వచించమని కోరుతున్నారు. ఈ పరిణామాలు, బీజేపీకి ఎంతో ఇబ్బంది అని తెలిసినా, కొంత మంది బీజేపీ నాయకులు మాత్రం, పైకి బిల్డ్ అప్ ఇస్తున్నారు.. సంవత్సర కాలం ఉంది, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నవి ఇచ్చేస్తే, చంద్రబాబు మన వెంటే ఉంటారు అనే స్పృహ మాత్రం, ఒక్క బీజేపీ నాయకుడుకి లేదు.. పవన్, జగన్ లాంటి నేతలతో, కులాల కుంపటి రగిలించి, లబ్ధి పొందటానికి చూస్తున్నారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read