కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్సులో బీజేవైఎం మహా అధివేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు గడ్డ పై మాట్లాడిన మాటలు, చంద్రబాబుని ఉద్దేశించేనా అనే అనుమానం కలుగుతుంది. ‘‘కాంగ్రెస్‌తో వెళుతున్న పార్టీలను ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు. తర్వాత పశ్చాత్తాప పడక తప్పదు. కాంగ్రెస్‌ మోసం చేసిందంటూ మీరు మీటూ ఉద్యమం చేయక తప్పదు’’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌తో ఏ పార్టీ కలుస్తుందో ఆ పార్టీ పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.

rajnadh 28102018 2

బీజేపీ బలాన్ని ఎదుర్కోలేక విపక్షాలు ఒక్కటవుతున్నాయని చెప్పారు. ఎన్ని కూటములు కట్టినా మోదీని ఎదుర్కోలేరని చెప్పారు. ఇదే సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా పాల్గున్నారు. తెలంగాణలో, ఆంధ్రలో పేదల కోసం పనిచేసే ప్రభుత్వాలు లేవని చెప్పారు. కేవలం కుటుంబ పాలన సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు వేల కోట్ల నిధులు కేంద్రం సమకూర్చుతోందన్నారు. కృష్ణా, పెన్నా, తుంగభద్రా నదులను అనుసంధానం చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల్లోని చివరి గ్రామాలకు నీటిని అందిస్తామని ప్రకటించారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యలతో వారం రోజులుగా పెట్రోల్‌ ధరలు తగ్గుతున్నాయని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

rajnadh 28102018 3

అయితే రాజ్‌నాథ్‌సింగ్‌ అన్న మాటలు చంద్రబాబుని ఉద్దేశించే అనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే, నిన్న చంద్రబాబు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి. కాంగ్రెస్ తో కలిసి వెళ్తున్నారా అని విలేకరులు అడిగితే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మోసం చేసింది, అదే సందర్భంలో రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చింది, కాని కేంద్రంలో బీజేపీ వచ్చింది. వీళ్ళు, కాంగ్రెస్ కంటే ఎక్కువ సహాయం చేస్తామని నమ్మించి మోసం చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక మాట అంటుంది. అప్పుడు తెలంగాణా ఇస్తాం అని చెప్పి ఇచ్చాం, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నాం, ఇస్తాం అంటుంది. ఈ సందర్భంలో, 25 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న మా రాష్ట్రానికి, కలిసి వచ్చే పార్టీలతో , కేంద్రం పై పోరాటం చెయ్యటం తప్ప, మాకు వేరే ఆప్షన్ లేదు, అది డెమోక్రాటిక్ కంపల్షన్ అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంలో, నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్న మాటలు, చంద్రబాబుని ఉద్దేశించే అనే అభిప్రాయం కలుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read