అన్నదాతగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారింది. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వమే ధ్రువీకరించిన కఠోర వాస్తవం.  టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాదకద్రవ్యాల సరఫరా, వాడకం, స్వాధీనం వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  దేశంలోనే అత్యధికంగా ఏపీలో డ్రగ్స్ దొరికినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేసిందని జవాబు ఇచ్చింది.  డీఆర్ ఐ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2021 వరకు దేశంలోనే పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్రం వెల్లడించింది. డీఆర్‌ఐ ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో తయారుచేసిన నివేదికలోనూ దేశంలోనే ఏపీ రాష్ట్రంలో అతిఎక్కువ డ్రగ్స్ పట్టుబడ్డాయని పేర్కొంది. 2021-22 సంవత్సరంలో అత్యధికంగా ఏపీలో 18,267.84 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయని వెల్లడించారు. వీటిలో బ్రౌన్‌ షుగర్‌, హెరాయిన్‌, ఓపియం, మార్ఫిన్‌, గంజాయి ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read