జస్టిస్ రాకేశ్ కుమార్.... అవినీతి పరుల పట్ల సింహ స్వప్నం. తప్పు జరిగితే, వెంటనే ఇది తప్పు అని చెప్పేస్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే, సరి దిద్దుతారు. న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించే క్రమంలో, తన పై విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా, చివరి రోజు వరకు న్యాయ దేవతకు సేవ చేసారు. ఈ రోజు ఆయన సర్వీస్ లో చివరి రోజు. ఆయన చివరి రోజు విధులు ముగించుకుని, హైకోర్టు నుంచి బయటకు వచ్చిన సమయంలో, ఆయనకు కనీ వినీ ఎరుగని రీతిలో వీడ్కోలు లభించాయి. అమరావతి రైతులు, మహిళలు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల తరుపున, ఘనంగా వీడ్కోలు పలికారు. దీనిలో భాగంగా, భారీ ఎత్తున రోడ్డుకు ఇరు వైపులా కిలో మీటర్లు పాటు నిలబడి, ముసలి ముతక, చిన్న పెద్ద తేడా లేకుండా, ఆయనకు ఘనమైన వీడ్కోలు పలికారు. ఆయన పై ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నా దాడికి, తాము ఆయనకు అండగా ఉంటాం అనే విధంగా, ప్రజలు ఆయనకు మద్దతు పలికారు. రైతులను చుసిన జస్టిస్ రాకేశ్ కుమార్, కారు ఆపి, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. రైతులు కూడా తమను అన్ని వైపుల నుంచి అందరూ వేధిస్తున్న సమయంలో, న్యాయ స్థానాలే తమను కాపాదాయని, రైతులు ఆయనకు కృతజ్ఞత తెలిపారు. రోడ్డుకు ఇరు వైపులా నుంచుని, ఆయనకు ప్రజలు ఘనంగా వీడ్కోలు లభించాయి. బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలో కూడా ఏ న్యాయమూర్తికి ఇలా ప్రజల నుంచి ఘనమైన వీడ్కోలు వచ్చి ఉండవు.
ఇక మరో పక్క ఆయన సహచరులు కూడా, ఆయనకు ఘనమైన వీడ్కోలు పలికారు. శాలువా కప్పి, జ్ఞాపిక అంద చేసి, ఆయన్ను సత్కరించారు. చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి, రాకేశ్ కుమార్ సేవలను కొనియాడారు. ఆయన ఎంతో మందికి స్పూర్తి అని అన్నారు. ఆయన రిటైర్మెంట్ జీవితం సంతోషంగా ఉండాలని కొనియాడారు. రాకేశ్ కుమార్ మాట్లాడుతూ, క్రీడాకారుడు అవుదాం అనుకుని, న్యాయ వృత్తిలోకి వచ్చానని అన్నారు. న్యాయమూర్తిగ అందించిన సేవలు, ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని అన్నారు.తనకు అన్ని విధాలుగా సహకరించిన సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా మరో ముఖ్య విషయం ఏమిటి అంటే, రాకేశ్ కుమార్ తనకు ఇచ్చిన బంగ్లాను నిన్నే ఖాలీ చేసారు. ఈ రోజు రాత్రికి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండో తారీఖు తన సొంత ఊరు పాట్నా వెళ్లనున్నారు. మొత్తంగా చివరి రోజు ఆయన తనాకు లభించిన ఘనమైన వీడ్కోలతో ఉద్విగ్న క్షణాల మధ్య అమరావతిని వదిలి, సొంత ఊరు పయనం అయ్యారు.