ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటు వంటి ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన సలహాదారు పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం రెడ్డికి తన రాజీనామాను పంపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 40 మంది సలదారులను పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకరు ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి ఒకరు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పబ్లిక్ పాలసీ సలహాదారుగా ఉన్నారు. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసాను అని బయటకు చెప్తున్నా, లోపల విషయం మాత్రం వేరే ఉందని తెలుస్తుంది. అత్యంత ప్రాధనమైన పదవికి సంబంధించి, ఆయన సలహాలు అక్కడ ఎవరూ తీసుకోవటం లేదని, తగిన ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదని, సన్నిహితులు వద్ద ఆయన వాపోయినట్టు తెలుస్తుంది. అయితే, ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చెయ్యగానే, రామచంద్రమూర్తికి ఫోన్ చేసారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ, రామకృష్ణ అభినందించారు. సలహాదారులు అందరూ అలంకరణగా మారారు అని, వీరు అంతా రాజీనామా చేసి, ప్రజాధనాన్ని వృద్ధా కాకుండా కాపాడాలని, రామకృష్ణ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read