తిరుమల తిరుపతి దేవస్థానం, గత 2-3 ఏళ్ళ నుంచి వివాదం అవుతూనే ఉంది. ఈ వివాదానికి మూలం అప్పట్లో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా ఉంటూ చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి, తిరుమలలో ఏవి పధ్ధతి ప్రకారం జరగటం లేదని, చివరకు వెంకన్నకు పెటే నైవేద్యం విషయంలో కూడా ఆలస్యం జరుగుతుంది అంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఈ ఆరోపణలను, అప్పటి మిగత ప్రధాన అర్చకులు ఖండించారు. ఈ వివాదాల నేపధ్యంలోనే రమణ దీక్షితులను తప్పించారు. అయితే తరువాత ఆయన కోర్ట్ కు వెళ్ళటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ క్రమంలోనే రమణ దీక్షితులు, జగన్ ని కలవటంతో, ఈ అంశం రాజకీయ మలుపు తీసుకుంది. వైసీపీ పార్టీ దీన్ని అప్పట్లో రాజకీయం చేసింది. పింక్ డైమెండ్ ని చంద్రబాబు మాయం చేసారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి అయితే ఒక అడుగు ముందుకు వేసి, శ్రీవారి నగలు అన్నీ చంద్రబాబు ఇంటి కింద ఉన్నాయని, అవన్నీ తవ్వితే ఎన్నో నగలు దొరుకుతాయని ఆరోపించారు.
ఇదే క్రమంలో ఎన్నికలు రావటం, జగన్ గెలవటం, అప్పట్లో రమణ దీక్షితులకు ఇచ్చిన మాట ప్రకారం, ఆయనను మళ్ళీ గౌరవ ప్రాధాన అర్చకుడిగా నియమించటం జరిగిపోయాయి. పోయిన వారం జరిగిన, టిటిడి బోర్డు మీటింగ్ లోనే, ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే, ఇప్పుడు రమణ దీక్షితులు చేసిన ఒక చర్య వివాదానికి కారణం అయ్యింది. నిన్న తిరుమల శ్రీవారి ఆలయంలో, ప్రధానార్చకులు, గౌరవ ప్రధానార్చకుల మధ్య జరిగిన ఒక చిన్న వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో, జరిగిన ఈ వివాదం పై అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రమణ దీక్షితులు, బయట నుంచి తెచ్చిన నెయ్యితో ఆలయానికి వెళ్లారు.
ఆ నెయ్యతోనే శ్రీవారి దీపం వెలిగించే ప్రయత్నం చెయ్యటంతో, ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధమని ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు అభ్యంతరం చెప్పారు. అయితే రమణ దీక్షుతులు మాత్రం, ఇందులో వివాదం ఏమి ఉంది, అయినా నాకు చెప్పటానికి, నువ్వు ఎవరు ? అంటూ ఆయనకు బదులు ఇచ్చారు. సన్నిధిలో గొడవను చూసి ఇతర అర్చకులు విస్తుపోయారు, వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేసారు. వేణుగోపాల దీక్షితుల కథను అధికారుల వద్దే తేల్చుకుంటానంటూ రమణ దీక్షితులు శ్రీవారి సన్నిధి నుంచి వెళ్లిపోయారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి గర్భాలయంలో మూలమూర్తికి అభిముఖంగా ఉండే రెండు అఖండాల్లో దేవస్థానం సరఫరా చేసే స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడతారని చెప్తున్నారు.